Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కొనుగోలు చేసిన కారు ఖరీదు ఎంతో తెలుసా?
August 18, 2023 / 08:10 PM IST
|Follow Us
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలందరూ కూడా ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు చాలా ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. తాజాగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సైతం ఖరీదైనటువంటి కారును కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈయన కొనుగోలు చేసిన కారుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈయన బీఎండబ్ల్యూ 7 సిరీస్ కు చెందిన లేటెస్ట్ వర్షన్ కారును కొనుగోలు చేశాడు.
ఈ కారు ఖరీదు అక్షరాల రూ.1.70కోట్లు. కారుతో లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇలా ఈయన ఖరీదైన కారును కొనుగోలు చేశారనే విషయం తెలియడంతో అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈయన దర్శకత్వం వహించిన విక్రమ్ సినిమా సెన్సేషనల్ హిట్ అయిన సంగతి మనకు తెలిసిందే.
చాలా రోజుల నుంచి హిట్ లేక సతమతమవుతున్న కమల్ హాసన్ కు విక్రమ్ సినిమా ద్వారా సెన్సేషనల్ హిట్ అందించడంతో కమల్ హాసన్ సైతం లోకేష్ కు దాదాపు కోటి రూపాయల విలువ చేసే కారును బహుమానంగా ఇచ్చారు. అయితే తాజాగా ఈయన మరో కారును కొనుగోలు చేయడం విశేషం. విక్రమ్ సినిమా మంచి సక్సెస్ కావడంతో కెరియర్ పరంగా లోకేష్ ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం ఈయన కోలీవుడ్ నటుడు విజయ్ హీరోగా నటించిన లియో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు అన్నింటిని పూర్తి చేసుకొని పోస్టు ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.ఈ సినిమాని దసరా కానుకగా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.