వెయిట్ చేయండి బ్రదర్స్ : మారుతి

  • March 24, 2018 / 08:08 AM IST

అక్కినేని నాగచైతన్య కోసం డైరక్టర్ మారుతి వెయిటింగ్ చేయడం ఏంటి?.. మళ్ళీ అతనే వెయిట్ చేయమని అభిమానులకు ఎందుకు చెబుతున్నాడు? కాస్త కన్ఫ్యుజింగ్ గా ఉంది కదూ.. ఈ విషయాల్లో క్లారటీకి వచ్చేద్దాం. అడల్ట్ కామెడీ చిత్రాల మచ్చని మారుతి  చెరుపుకొని.. మంచి సినిమాలవైపు నడుస్తున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి చిత్రాలు వినోదాన్ని పంచాయి. ఇప్పుడు ఓ యూత్ ఫుల్ యాక్షన్ స్టోరీ ని రూపొందిస్తున్నారు. అందులో హీరోగా యువ సామ్రాట్ నాగచైతన్య నటిస్తున్నారు.

ఆ సినిమా, సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు మారుతిని కొన్ని రోజులుగా అడుగుతున్నారు. దీనిపై తన సోషల్ మీడియా అకౌంట్ లో సమాధానం ఇచ్చారు. “అందరూ చైతూ మూవీ గురించి అడుగుతున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండవ షెడ్యూల్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. “సవ్యసాచి” సినిమా పనుల్లో చైతూ బిజీగా ఉండటమే ఈ ఆలస్యానికి కారణం. నేను మీలాగే ఆయన కోసం వెయిటింగ్ చేస్తున్నాను.” అని పోస్ట్ చేశారు. ఇక శైలజ రెడ్డి అల్లుడు సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడొస్తుందో ప్రశ్నకు కూడా జవాబు ఇచ్చారు. “ఈ సినిమా ఫస్టులుక్ ను మే నెలలో రిలీజ్ చేస్తాము. అప్పటివరకూ వెయిట్ చేయండి బ్రదర్స్ ” అంటూ మారుతి ట్వీట్ లో ఫ్యాన్స్ ని కోరారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus