ప్లాప్ టాక్ వచ్చిందని రివ్యూల పై తోసేస్తే ఎలా నాగేశ్వరా..!
November 16, 2019 / 08:24 PM IST
|Follow Us
సినిమా సరిగ్గా ఆడనప్పుడు రివ్యూలు సరిగ్గా ఇవ్వలేదని చెప్పడం ఈమధ్య కొందరు చిత్ర యూనిట్ సభ్యులు కామెంట్స్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. సినిమా బాగున్నప్పటికీ పని గట్టుకుని నెగెటివ్ రివ్యూలు, రేటింగ్ లతో.. కలెక్షన్లు చెడగొడుతున్నారు అంటూ ఎంతో మంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే రివ్యూలను యాక్సెప్ట్ చేస్తూ… ‘మీ అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నాం.. ఇలాంటి తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటాం’ అని చెప్పుకొచ్చే వారుకూడా ఉన్నారు. అయితే రివ్యూలను టార్గెట్ చేసే ప్రతీ చిత్ర యూనిట్ సభ్యులు సక్సెస్ మీట్లు పెట్టుకుని మరీ కామెంట్స్ చేస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఇటీవల ఓ ప్లాప్ డైరెక్టర్ కూడా రివ్యూల పై ఫైర్ అవుతూ సంచలన కామెంట్స్ చేస్తుండడం విశేషం. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. జి.నాగేశ్వర రెడ్డి. ఇటీవల ఆయన సందీప్ కిషన్ తో తెరకెక్కించిన ‘తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్’ చిత్రానికి అట్టర్ ప్లాప్ టాక్ వచ్చింది. అందుకు గాను ఈ చిత్రం పై నెగిటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. వీకెండ్ ను క్యాష్ చేసుకోవాలని సక్సెస్ మీట్ పెట్టి ప్రమోషన్లు చేసేలా ప్లాన్ చేశారు. ఈ వేడుకలో దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ .. “మా సినిమాని ఫుల్ కామెడీతో చేస్తున్నట్టు మొదటి నుంచీ చెప్తున్నా…నేను శంకరాభరణం తీస్తున్నా, స్వాతిముత్యం తీస్తున్నా అని ఎవరికీ చెప్పలేదు. కొందరు వెబ్ సైట్స్ వాళ్ళు రేటింగ్ విషయంలో…సినిమాని తక్కువ చేసారు. మేము ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అని చెప్పాం…అదే తీసాం..జనం థియోటర్స్ లో నవ్వుతున్నారు.
ఇక మీ రేటింగ్ ఏమిటో అర్దం కావటం లేదు. నవ్వులకు రేటింగ్ ఏమిటి…నేనేమన్నా అవార్డ్ విన్నింగ్ సినిమా తీసానా..లేక ప్రపంచంలో అత్యుత్తమైన సినిమాను తీస్తున్నాను..ఆస్కార్ అవార్డ్ కు పంపిస్తున్నాను అని నేను చెప్పలేదు. అలాంటి సినమా మీరు చేయాలనుకుంటే మీరు చేయండి..మీరు తీసి ఆస్కార్ అవార్డ్ లకు పంపి…మేము భీబత్సమైన సినిమా తీసాం అని తొడగొట్టి మీసం తిప్పండి..మేము ఎంటర్టైన్మెంట్ సినిమా తీసాం…థియోటర్ లో జనం తెగ నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ మాకు ఫోన్ చేసి సినిమా బ్రహ్మాండంగా ఉంది.మా కమీషన్స్ మాకు వస్తున్నాయి. పబ్లిసిటీ బాగా చెయ్యమంటున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు పెట్టి కొంటారు. మనలా ఫ్రీగా పెన్ను పెట్టి పేపరు, పెన్ను ఉందని రాయరు. వాళ్ళకన్నా మనం గొప్పోళ్ళం కాదు. సినిమా నచ్చకపోతే రాయద్దు. తిట్టద్దు. ప్రేక్షకులకు నచ్చింది..అది చాలు. పనిగట్టుకుని సినిమాకు రాకుండా చేయద్దు అన్నారు. ప్రతీ రివ్యూ పైనా చాలా మంది లైఫ్ లు ఆధారపడి ఉంటాయి. రివ్యూలని ఎక్కడో పొలాల్లో ఉన్న రైతు,కూలీలు కూడా చూస్తున్నారు. కమర్షియల్ సినిమాలు,కామెడీ సినిమాలను పిచ్చి సినిమాలతో పోల్చకండి. జనాలకు ఇలాంటి సినిమాలే కావాలి” అంటూ కామెంట్స్ చేసాడు.