ప్రతి ఒక్కడి ఫోన్ లో ఆ వీడియోలే.. దర్శకుడి కామెంట్స్!
February 9, 2021 / 01:12 PM IST
|Follow Us
తన కెరీర్ లో ఎన్నో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రవిబాబు ప్రస్తుతం ‘క్రష్’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందనే మాటలు వినిపించాయి. దానికి తగ్గట్లుగానే సినిమా టీజర్ ని బూతు కంటెంట్ తో నింపేశారు రవిబాబు. అయితే ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారనే విమర్శలపై తనదైన శైలిలో స్పందించారు రవిబాబు. తనేదో కొత్తగా సెex, పోrn చూపించాలని అనుకోవడం లేదని.. ప్రతి ఒక్కడి ఫోన్ లో 40GB స్టోరేజ్ ఉంటే.. అందులో 20GB పోrn వీడియోలు ఉంటాయని అన్నారు.
ఇలాంటి వాళ్లకి కొత్తగా చూపించాల్సింది ఏం లేదని.. తను కేవలం ఒక స్టోరీని మాత్రమే చూపించాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ‘క్రష్’ అనే సినిమాలో ముగ్గురు కుర్రాళ్లకు సంబంధించిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ను చూపించాలని అనుకున్నట్లు చెప్పారు. ట్రైలర్ లో సాఫ్ట్ రొమాంటిక్ సీన్లు చూపించి… తీరా థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు ఇది ఇలాంటి సినిమానా అని ప్రేక్షకుడు అనుకోకూడదని.. అందుకే ఎలాంటి సినిమా తీశామనే దానిపై ఓ క్లారిటీ ఇవ్వాలని టీజర్ అలా కట్ చేశామని చెప్పారు.
రాంగ్ ప్రమోషన్ చేసే ఉద్దేశం లేదని అన్నారు. తనకు అన్ని రకాల సినిమాలు తీయడం ఇష్టమని.. రకరకాల ప్రయోగాలు చేయాలని ఉంటుందని అన్నారు. ఒకసారి చేసిందే మళ్లీ చేయాలంటే బోర్ కొడుతుందని అన్నారు. కొత్త స్టఫ్ లేకపోతే జనాలు సినిమాలు చూడరని.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సినిమా తీయాలనుందని చెప్పారు.