ఇటీవల టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణించిన కొన్ని రోజులకే మరో ప్రముఖ సినీ సెలెబ్రిటీ, దర్శకుడు సంజయ్ గాధ్వీ మరణించారు. సంజయ్ గాధ్వీ హిందీలో ధూమ్, ధూమ్ 2 సినిమాలకు దర్శకత్వం వహించి పాపులర్ అయ్యారు. ఇక సంజయ్ గాధ్వీ.. హటాత్తుగా మృతి చెందడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా సోక సంద్రంలో మునిగిపోయింది.
ఈ రోజు తెల్లవారుజామున మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో సంజయ్ గాధ్వీ గుండెపోటులో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. సంజయ్ గాధ్వీ మృతితో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.
సంజయ్ గాధ్వీ హిందీలో తేరే లియే సినిమాతో దర్శకుడిగా పరిచయమైయ్యారు. ఆ తర్వాత ఆయన కిడ్నాప్, మేరే యార్ కి షాదీ హై, అజబ్ గజబ్ లవ్, ధూమ్, ధూమ్ 2 హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి బంపర్ హిట్స్ అందుకున్నారు. సడెన్‌గా సంజయ్ గాధ్వీ గుండెపోటుతో మరణించడంతో హిందీ సినీ ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు ఆయన కుంటుంబానికి ప్రగాడ సంతాపం తెలుపుతున్నారు.
అలాగే దర్శకుడు సంజయ్ గుప్తా.. ‘చాలా త్వరగా వెళ్లిపోయావు మిత్రమా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే నీ ఎనర్జీని మేం మిస్ అవుతాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను మిత్రమా’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక తమ బ్యానర్‌లో ‘ధూమ్’, ‘ధూమ్ 2’ సినిమాలు చేసిన సంజయ్‌కు యశ్ రాజ్ ఫిలింస్ ఎక్స్ ద్వారా నివాళి అర్పించింది.