Shankar: ‘గేమ్ ఛేంజర్’ X ‘భారతీయుడు 2’.. శంకర్ క్వాలిటీ ఏమన్నా తగ్గిందా?
July 9, 2024 / 08:48 PM IST
|Follow Us
ఈ రోజుల్లో ఒక సినిమాకు మరొక సినిమాకు ఏడాది గ్యాప్ ఇస్తున్న హీరోలు ఉన్నారు. కొంతమంది అయితే రెండేళ్లు కూడా ఇస్తున్నారు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలా తెలియక సతమతం అవుతుంటే.. ఈ మధ్య అగ్ర దర్శకులు కూడా ఏడాది గ్యాప్‌లు తీసుకోవడం ప్రారంభించారు. వివధ కారణాల వల్ల అవి ఏళ్లకు ఏళ్లు అయిపోతున్నాయి. అలా ఎక్కువ గ్యాప్ తీసుకునే వాళ్లలో శంకర్ (Shankar) ఒకరు. అలాంటి వ్యక్తి నుండి ఒకేసారి రెండు సినిమాల షూటింగ్‌లు అంటే ఆశ్చర్యమే కదా.
ఇప్పుడు ‘ఇండియన్ 2’ (Bharateeyudu 2), ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అంటూ రెండు సినిమాలను ఒకేసారి హ్యాండిల్ చేశారాయన. ఆ సినిమా ఒక షెడ్యూల్, ఈ సినిమా ఒక షెడ్యూల్ అంటూ షూటింగ్ చేశారు. అయితే ‘భారతీయుడు 2’, ‘గేమ్ ఛేంజర్’ ఒకేసారి సినిమాలు తీయడం వల్ల నాణ్యత ఏమైనా తగ్గిందేమో అనే అనుమానాలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో చిన్నపాటి చర్చ జరుగుతోంది. దీనిపై ఇటీవల దర్శకుడు శంకర్ స్పందించారు. రెండు సినిమాల పనులు ఒకేసారి జరగడం వల్ల క్వాలిటీ తగ్గిందేమో అనే ఆలోచనే అక్కర్లేదు.
ఎందుకంటే పక్కా ప్రణాళికతో రెండు సినిమాల్నీ తెరపైకి తీసుకొచ్చాం అని శంకర్ క్లారిటీ ఇచ్చారు. రెండు సినిమాలు తీయడంలో ఎలాంటి అసౌకర్యం కనిపించలేదు. దీని వల్ల క్వాలిటీ మీద ఏమైనా ప్రభావం పడుతుందేమో అనే ఆలోచన రావడంతో.. అందరం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి సినిమా పూర్తి చేశాం. అందుకే క్వాలిటీ తగ్గలేదు. ఆ మాటకొస్తే కాస్త పెరిగింది కూడా. ఒకసారి ఒక సినిమా చేస్తున్నపుడు ఎంతటి క్వాలిటీ చూపిస్తానో.. రెండు సినిమాల్లో అంతే చూపించాను.
‘భారతీయుడు 2’ రిలీజ్ అయిన వెంటనే ‘గేమ్ ఛేంజర్’ పెండింగ్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేస్తారట. ఫైనల్ ఎడిట్ పూర్తయిన వెంటనే సినిమా రిలీజ్‌పై నిర్ణయం తీసుకుంటాం అని శంకర్ చెప్పారు. అయినా ఇప్పుడంటే ఆశ్చర్యం కానీ.. ఒకప్పుడు ఒక దర్శకుడు ఏక కాలంలో ఒకే స్టూడియోలో నాలుగు సినిమాల షూటింగ్‌లు చేసిన రోజులున్నాయి.