Director Shankar: 28 ఏళ్ల తర్వాత కూడా అదే ఫీలింగ్.. సేనాపతి గురించి శంకర్ కామెంట్స్ వైరల్.!
July 8, 2024 / 05:06 PM IST
|Follow Us
కొన్ని సినిమాలు వచ్చి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా అందులోని పాత్రలు మనకు జీవితాంతం గుర్తుండిపోతాయి. అలాంటి సినిమాల్లో ‘భారతీయుడు’ ఒకటి. లంచం మీద ఎవరూ చేయని విధంగా యుద్ధం చేసిన సేనాపతిని ఆ సినిమాలో చూపించారు దర్శకుడు శంకర్ (Shankar). ఈ పాత్రను ఫస్ట్ పార్ట్‌లో చూసినప్పుడు ఎంతగా నచ్చిందో, ఇప్పుడు రెండో పార్టులో అంతకుమించి నచ్చుతుంది అని శంకర్ చెప్పారు. ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) సినిమా ఈ నెల 12న విడుదలవుతున్న సందర్భంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఆ వేదిక మీద శంకర్ మాట్లాడుతూ సినిమా కథ ఆలోచన ఎలా వచ్చింది, షూటింగ్ ఎలా జరిగింది, కమల్ హాసన్ (Kamal Haasan) ఎలా నటించారు అనే వివరాలను ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. ‘భారతీయుడు’ సినిమా విడుదలైన తర్వాత ఎప్పుడు పేపర్ చూసినా, వార్తలు చూసినా.. ‘లంచం’ వార్తలు కనిపిస్తుండేవి. అప్పుడు సేనాపతి గుర్తొచ్చేవారు. ‘రోబో 2.0’ సినిమా షూటింగ్ సమయంలో ‘భారతీయుడు మళ్లీ వస్తే!’ ఎలా ఉంటుందన్న ఆలోచనతో కమల్ హాసన్‌కు కథ చెప్పాను.
ఆయన కూడా ఓకే అవ్వడంతో సినిమా పట్టాలెక్కించేశాను. ‘భారతీయుడు’ సినిమా షూటింగ్‌కి ముందు సేనాపతి లుక్ కోసం కమల్ తండ్రి, సోదరుల ఫొటొల్ని రిఫరెన్స్‌గా తీసుకున్నాం. ఆ లుక్‌లో తొలిసారి కమల్‌ను చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. మళ్లీ ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత ‘భారతీయుడు 2’ కోసం సేనాపతి లుక్‌లో కమల్‌ను చూసిన అదే ఫీల్ వచ్చిందని శంకర్ చెప్పారు.
ఇక ఈ సినిమాలో కమల్ చేసిన ఓ రిస్కీ షాట్ గురించి శంకర్ చెప్పి వావ్ అనిపించారు. నాలుగు రోజుల పాటు రోప్‌కి వేలాడుతూ, ప్రోస్థటిక్ మేకప్‌తో కమల్ ఓ సీన్ చేశారని, ఫాస్ట్ మోడ్‌లో ఉన్న ఓ డైలాగ్‌ను అర్థం చేసుకుని స్లో మోషన్ నటించడం చాలా కష్టమని.. ఆ పని కమల్ చేశారని శంకర్ చెప్పారు. ప్రపంచంలోనే ఇలాంటి నటుడు ఇంకొకరు ఉండరు అని చెప్పారు శంకర్.