Shankar, Dil Raju: దిల్ రాజుకు చుక్కలు చూపిస్తున్న శంకర్.. డబుల్ బడ్జెట్ అయ్యేలా ఉందిగా..!
November 4, 2022 / 12:36 PM IST
|Follow Us
‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత రాంచరణ్ ఫుల్ లెంగ్త్ హీరోగా శంకర్ డైరెక్షన్లో ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాంచరణ్ కెరీర్లో 15వ చిత్రంగా ఈ మూవీ రూపొందుతుంది. ఈ మూవీకి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాత. ఇది దిల్ రాజు బ్యానర్లో రూపొందుతున్న 50 వ సినిమా. దీంతో ఈ మూవీని ఎంతో ప్రెస్టీజియస్ గా రూపొందించాలని అతను ముందుగానే ఈ మూవీకి రూ.200 కోట్ల బడ్జెట్ ను కేటాయించాడు.
కానీ శంకర్ అంటే గ్రాండియర్, గ్రాండియర్ అంటే శంకర్ కాబట్టి.. ఈ మూవీ స్టార్టింగ్ నుండే బడ్జెట్ ను పెంచుతూ వచ్చాడు. రీషూట్లు ఎక్కువగా చేయడం, సెట్స్ ఎక్కువ వేయించడం, రషెస్ చూసిన తర్వాత ఏమాత్రం తేడాగా అనిపించినా శంకర్ వాటిని ఓకే చేయకపోవడం ఇలా జరుగుతుంది తంతు. అందుకే ఈ మూవీ ఇప్పటి వరకు కానీ కష్టంగా 60 శాతం పూర్తయింది. బడ్జెట్ కూడా రూ.260 కోట్ల వరకు అయ్యింది అని వినికిడి.
ఇది చాలదు అన్నట్టు ఇప్పుడు మరో రూ.35 కోట్లు అదనంగా ఖర్చయ్యే అవకాశం ఉందట. ఇటీవల రాజమండ్రిలో ఓ షెడ్యూల్ జరిగింది. దీనికి సంబంధించిన రషెస్ చూసిన శంకర్ సంతృప్తి చెందలేదని తెలుస్తుంది. వీటిని మళ్ళీ కేరళ వెళ్లి చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నాడట. కొన్ని సన్నివేశాల కోసం విదేశాలకు టీం ను తీసుకెళ్లాలని భావిస్తున్నాడట. వీటి మొత్తం లెక్క రూ.35 కోట్ల వరకు తేలుతుందని తెలుస్తుంది.
శంకర్ సినిమా అంటే ఆ మాత్రం ఖర్చు ఉంటుంది. కానీ ఎప్పుడూ తక్కువ బడ్జెట్ లో సినిమా రూపొందించాలనుకునే దిల్ రాజుకి ఇది భారంగా అనిపిస్తుందని తెలుస్తుంది.ఇక ఈ మూవీలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. హీరోయిన్ గా కియారా అద్వానీ ఎంపికైంది. అంజలి, శ్రీకాంత్,జయరాం, సునీల్ వంటి వారు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.అతను గతంలో శంకర్ తెరకెక్కించిన బాయ్స్ లో నటించిన సంగతి తెలిసిందే.