2005 సంవత్సరంలో విక్రమ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన అన్నియన్(అపరిచితుడు) తమిళ, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 15 సంవత్సరాల తరువాత ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్టు స్టార్ డైరెక్టర్ శంకర్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. రణవీర్ సింగ్ తో ఈ సినిమా చేయనున్నట్టు శంకర్ ప్రకటించడంపై అన్నియన్ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్నియన్ రీమేక్ హక్కులను కొనుగోలు చేయకుండా సినిమాను ఎలా రీమేక్ చేస్తారని ఆస్కార్ రవిచంద్రన్ శంకర్ ను ప్రశ్నించారు. అయితే ఆస్కార్ రవిచంద్రన్ ప్రశ్నకు శంకర్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు.
ఆస్కార్ రవిచంద్రన్ అన్నియన్ సినిమా హక్కులు తన దగ్గర ఉన్నాయని చెప్పడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని శంకర్ పేర్కొన్నారు. అన్నియన్ మూవీ టైటిల్స్ లో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ శంకర్ అని తన పేరు పడుతుందని ఈ కథపై హక్కులన్నీ తనవే అని శంకర్ అన్నారు. అన్నియన్ సినిమా కథ, కథనం, దర్శకత్వం విషయంలో స్వర్గీయ సుజాతగారికి ఎటువంటి సంబంధం లేదని శంకర్ వెల్లడించారు. ఆస్కార్ రవిచంద్రన్ కు ఈ సినిమాపై ఎలాంటి హక్కులు లేవని ఈ సినిమాను రీమేక్ చేసుకునే హక్కు తనకు మాత్రమే ఉందని శంకర్ పేర్కొన్నారు.
అన్నియన్ సినిమాతోనే ఆస్కార్ రవిచంద్రన్ కు నిర్మాతగా గుర్తింపు వచ్చిందని నిరాధారమైన ఆరోపణలతో రవిచంద్రన్ తనను బెదిరించవద్దని శంకర్ కోరారు. నా కెరీర్ పై జరుగుతున్న అన్యాయమైన ఆరోపణలను ఖండించి వివరణ ఇస్తున్నానని శంకర్ అన్నారు. సాధారణంగా సినిమా రీమేక్ రైట్స్ పై నిర్మాతలకు, సొంత కథతో తెరకెక్కించిన దర్శకులకు హక్కు ఉంటుంది. అయితే నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ కు హక్కు లేదంటూ శంకర్ చెప్పిన లాజిక్ చట్టపరంగా చెల్లుతుందో లేదో చూడాల్సి ఉంది.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!