డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్.. ఏ హీరో పైన..?

  • October 16, 2019 / 08:43 PM IST

ముక్కు సూటిగా మాట్లాడే దర్శకుల్లో ముందు వరుసలో ఉంటాడు డైరెక్టర్ తేజ. తన గురువు రాంగోపాల్ వర్మ లానే ఈయన మాట్లాడే ప్రతీ మాటా ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటుంది అనడంలో సందేహం. ఇటీవల ఉత్తేజ్ యాక్టింగ్ స్కూల్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు డైరెక్టర్ తేజ. ఈ కార్యక్రమంలో నటనలో మెళుకువలు గురించి పిల్లలతో ముచ్చటించిన తేజ.. దొరికిందే సందు అన్నట్టు కొన్ని సంచలన కామెంట్లు చేసి వార్తల్లో నిలిచాడు.

తేజ మాట్లాడుతూ… “చిరంజీవి ఊరికే మెగాస్టార్ అయిపోలేదు. ఆయనే కాదు సూపర్ స్టార్ అనిపించుకున్న అమితాబ్ కూడా ఇప్పటికీ నటనలో ఏదొకటి కొత్తగా నేర్చుకోడానికి ప్రయత్నిస్తుంటారు. షూటింగ్లో ఆయన పార్ట్ కంప్లీట్ అయిపోయినప్పటికీ… వేరే నటుడి నటన చూస్తూ… ఆయన కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇప్పుడున్న కొందరు హీరోలు ‘క్యార్ వాన్’ కూడా దిగరు” అంటూ ఓ సెటైర్ వేసాడు తేజ. తేజ చెప్పిన దాంట్లో మోరల్ ఉంది. అలాగే భయంకరమైన నిజం కూడా ఉంది. అసలు తేజ ఏ హీరోని టార్గెట్ చేసి ఈ కామెంట్స్ చేశాడు.. అనేదాని పై ఇప్పుడు చర్చ మొదలైంది.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus