Director Teja: తేజ- అభిరామ్‌ సినిమాపై ఇంట్రెస్టింగ్‌ రూమర్‌!

  • July 6, 2021 / 01:44 PM IST

కాన్సెప్ట్‌ ఏదైనా… దానిని ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా చెప్పడం తేజ స్పెషాలిటీ. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఫ్లాప్‌ అయ్యుండొచ్చు కానీ… ప్రేక్షకులకు కనెక్ట్‌ అవ్వడంలో ఫ్లాప్‌ కాలేదు అంటారు. తాజాగా తేజ ‘అహింస’ అనే సినిమాను అనౌన్స్‌ చేశారు. దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా ఈ సినిమా మొదలైంది. టైటిల్‌ చూసి ఇదేదో సందేశాత్మక చిత్రం ఏమో అని అనుకుంటున్నారు. అయితే ఫుల్‌యాక్షన్‌ ఫిల్మ్ అని ఇప్పుడు తెలుస్తోంది. అహింస అనే ఆయుధంతోనే తెల్లవారిని దేశం నుండి త‌రిమికొట్టారు గాంధీజీ.

ఆ పాయింట్‌తోనే ఇప్పుడు తేజ – అభిరామ్‌ వస్తున్నారట. అంటే ఈ సినిమాలో తేజ మార్కు గాంధీగిరి చూడొచ్చు అని అంటున్నాయి సురేష్‌ ప్రొడక్షన్స్‌ వర్గాలు. అయితే ఇందులో తేజ మార్కు ప్రేమకథ కూడా ఉంటుందని తెలుస్తోంది. సినిమా పేరుకు ‘అహింస’నే కానీ… సినిమాలో కావాల్సినంత యాక్షన్‌ ఉంటుందని సమాచారం. చాలా రోజుల క్రితం తేజ `చిత్రం 1.1`ను అనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే. అంతా కొత్తవాళ్లతో ఆ సినిమా తీస్తారని కూడా చెప్పారు.

అయితే అభిరామ్ కోసం ఆ ప్రాజెక్టు ప‌క్క‌న పెట్టేశారట తేజ. `అహింస‌` త‌ర‌వాత ‘చిత్రం’ సీక్వెల్ సెట్స్‌పైకి వెళ్తుందట. అయితే ‘అహింస’ కాస్ట్‌ అండ్‌ క్రూ విషయంలో ఇంకా ఓ స్పష్టత అయితే రాలేదు. కొత్త భామను హీరోయిన్‌గా తీసుకునే ఉద్దేశంలో ఉన్నారట తేజ అండ్‌ కో.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus