Trivikram: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ పెళ్లి ఫోటో వైరల్..!
July 19, 2022 / 05:03 PM IST
|Follow Us
రచయితగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన త్రివిక్రమ్.. ‘స్వయంవరం’ ‘చిరునవ్వుతో’ ‘నువ్వే కావాలి’ ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘మల్లీశ్వరి’ వంటి సూపర్ చిత్రాలకు పని చేసాడు. త్రివిక్రమ్ రైటర్ గా పనిచేసిన అన్ని సినిమాలు క్లాసిక్స్ గా మిగిలాయి అని చెప్పొచ్చు. అటు తరువాత తరుణ్ హీరోగా వచ్చిన ‘నువ్వే నువ్వే’ చిత్రంతో దర్శకుడిగా మారారు త్రివిక్రమ్. ఇది మంచి హిట్ అయ్యింది. ఈ చిత్రం టైములోనే త్రివిక్రమ్ కు సౌజన్య అనే ఆమెతో వివాహం జరిగింది.
వీళ్ళిద్దరి పెళ్లి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈమెను వీళ్ళకు ఇద్దరు పిల్లలు. నిజానికి ఆమెను వివాహం చేసుకున్న తర్వాత త్రివిక్రమ్ కు బాగా కలిసొచ్చింది అని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక త్రివిక్రమ్ భార్య సౌజన్య…సుప్రసిద్ధ సాహిత్య రచయిత అయిన పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సోదరుడి కూతురు అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈమె ఓ నాట్యకళాకారిని కూడా.!
2018లో ఈమె రవీంద్ర భారతిలో భరతనాట్యం ప్రదర్శన కూడా ఇచ్చిందట. నిజానికి త్రివిక్రమ్.. సౌజన్య గారి అక్కను వివాహం చేసుకోవాల్సిందట. కానీ సౌజన్య గారు నచ్చడంతో ఈమెను పెళ్లి చేసుకుంటాను అని త్రివిక్రమ్ ప్రైవేట్ గా సీతారామరాశాస్త్రి గారికి చెప్పాడట. ఆయన అర్ధం చేసుకుని వీరిద్దరికి వివాహం చేసినట్టు స్పష్టమవుతుంది. ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు తో ఓ సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.