బూతులు తిడుతూ కేజీఎఫ్ పై డైరెక్టర్ ఫైర్.. ఏం జరిగిందంటే?
March 6, 2023 / 04:37 PM IST
|Follow Us
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలు అంచనాలకు మించి కలెక్షన్లను సాధించడంతో పాటు హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలకు రికార్డ్ స్థాయిలో లాభాలను అందించాయి. కమర్షియల్ గా ఈ సినిమాలు నిర్మాతలకు, బయ్యర్లకు మంచి లాభాలను అందించాయి. అయితే ప్రముఖ డైరెక్టర్ కేజీఎఫ్ సినిమాను బూతులు తిడుతూ ఫైర్ అయ్యారు. కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా కేజీఎఫ్ మూవీపై ఈ కామెంట్లు చేశారు.
మేము కొన్ని విలువలతో సినిమాలు తీస్తున్నామని కొంతమంది ఆ సినిమాలను ఓటీటీ సినిమాలు అని డీగ్రేడ్ చేస్తున్నారని ఆయన తెలిపారు. అదే సినిమా క్లైమాక్స్ లో తవ్విన వాళ్లకు ఇల్లు ఇచ్చి బంగారాన్ని సముద్రంలో పడేసే నీ* క** గాడి మీద సినిమా తీస్తే ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఏ తల్లి అయినా గొప్పోడివి కావాలని చెబుతుందంటే ఆ మాటల అర్థం నలుగురికీ ఉపయోగపడాలని అని ఆయన అన్నారు.
ఆ తల్లి బంగారం కావాలని అంటుందని హీరో వెళ్లి బంగారం తీసేవాళ్లను ఉద్దరిస్తాడని వెంకటేష్ మహా పేర్కొన్నారు. చివర్లో హీరో బంగారం పోగేసి ఆ బంగారాన్ని ఎక్కడో పార దొబ్బుతాడని ఆడంత నీ* క** కు* ఉంటారా అని వెంకటేశ్ మహా కామెంట్లు చేశారు. అలాంటి కు* కావాలని తల్లి అడగగా ఇలాంటి కథలను సినిమాగా తీసి మనం ఎంకరేజ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ప్రతి సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చాలని రూల్ లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తోటి దర్శకులను డీగ్రేడ్ చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు చెబుతున్నారు. మీ సినిమా గురించి ఇలాంటి కామెంట్లు చేస్తే ఊరుకుంటారా? అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వెంకటేశ్ మహా చేసింది తప్పేనని మెజారిటీ నెటిజన్లు చెబుతుండగా కొందరు మాత్రం ఆయన కామెంట్లను సమర్థిస్తున్నారు. ఆయన ఆవేదనలో న్యాయం ఉందని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.