హీరో ఇంటి ముందు ప్లకార్డుతో ధర్నాకి దిగిన దర్శకుడు వెంకటేష్ మహా!

  • March 10, 2023 / 03:13 PM IST

టాలీవుడ్లో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో వెంకటేష్ మహా కూడా ఒకరు. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి చిత్రాలకు ఇతను దర్శకత్వం వహించాడు. ఇవి రెండు బాగానే ఉంటాయి కానీ దర్శకుడు ఇటీవల ‘కె.జి.ఎఫ్'(సిరీస్) పై చేసిన కామెంట్స్ వల్ల ఆ సినిమాల పై కూడా సెటైర్లు పడుతున్నాయి. నిజానికి సినిమాలతో కన్నా ఈ వివాదంతో వెంకటేష్ మహా ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇతను ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు.

లాక్ డౌన్ టైంలో ఓటీటీలో రిలీజ్ అయిన ఇతని రెండో సినిమా ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ లో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు పై అలాగే అతని అభిమానులపై నేరుగా సెటైర్లు వేశాడు. ఆ టైంలో మహేష్ బాబు అభిమానుల చేతిలో దారుణంగా ట్రోల్ అయ్యాడు వెంకటేష్ మహా. సినిమాల్లోనే కాకుండా ఇతను రియల్ లైఫ్ లో కూడా నోరు పారేసుకుంటాడు అని ఇటీవల ఓ ఇంటర్వ్యూ ద్వారా ప్రూవ్ అయ్యింది.

ఇదిలా ఉండగా.. తాజాగా ఇతను ఓ హీరో ఇంటి ముందు ప్లకార్డుతో ధర్నాకి దిగడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇది నిజ జీవితంలో కాదు.. రీల్ లైఫ్ లో..! వెంకటేష్ మహా నటుడిగా కూడా ‘స్టాండప్ రాహుల్’, ‘అంటే సుందరానికి’ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు. తాజాగా ‘యాంగర్ టేల్స్’ అనే వెబ్ సిరీస్లో భాగంగా ‘బెనిఫిట్ షో’ అనే కథలో వెంకటేష్ మహా ప్రధాన పాత్ర పోషించాడు.

ఇందులో ఓ స్టార్ హీరోకి వీరాభిమాని అయిన ఇతను రంగ అనే పాత్రలో కనిపిస్తాడు. తనకు ఇష్టమైన హీరో సినిమా కోసం ఓ యువ రాజకీయ నేతతో మాటల యుద్ధానికి దిగిన రంగకి ఘోరమైన అవమానం ఎదురవుతుంది. అందుకే హీరో ఇంటి ముందు ఇలా ధర్నాకి దిగుతాడు. ఈ పాత్ర కోసం అతను కొన్ని బూతు పదాలు కూడా పలకడం ఈ కథకి బోల్డ్ నెస్ ను యాడ్ చేసిందని చెప్పాలి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus