Venu Sriram: వకీల్ సాబ్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్… ఫాన్స్ కు పూనకాలే!

  • April 11, 2023 / 04:41 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండి గతంలో కొంతకాలం పాటు సినిమాలకు విరామం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తూ వకీల్ సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఈ సినిమా పింక్ చిత్రానికి రీమేక్ చిత్రం అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో మార్పులు చేశారు.

దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన విషయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరుమల్లు, ఓజీ, వినోదయ సీతం అనే రీమేక్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలకు కమిట్ అయిన పవన్ కళ్యాణ్ ఈ ఏడాదిలోగా ఈ సినిమాలన్నీ పూర్తి చేసి తిరిగి రాజకీయాలలో బిజీ కానున్నారు.

ఇలాంటి తరుణంలోనే డైరెక్టర్ వేణు శ్రీరామ్ తాజాగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా సీక్వెల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈయన వకీల్ సాబ్ సీక్వెల్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఐకాన్ సినిమా చేయాలని వేణు శ్రీరామ్ భావించారు. అయితే ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.

ప్రస్తుతం తాను మూడు సినిమా స్క్రిప్టులు సిద్ధం చేస్తున్నానని అందులో ఒకటి వకీల్ సాబ్ సీక్వెల్ చిత్రం అంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు. వకీల్ సాబ్ సినిమాలో కన్నా సీక్వెల్ చిత్రంలో ఫాన్స్ కు పూనకాలు తెప్పించే సీన్స్ చాలా ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ సీక్వెల్ గురించి క్లారిటీ ఇవ్వడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై ఇప్పుడే అంచనాలను పెంచేసుకుంటున్నారు.మరి ఈ సినిమాకు ఎప్పుడు ముహూర్తం ఫిక్స్ చేస్తారో తెలియదు కానీ ఈ విషయం మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus