స్టార్ డైరెక్టర్ చిల్లర చేష్టలు మరీ ఏవగింపుగా ఉన్నాయి
June 26, 2018 / 12:36 PM IST
|Follow Us
భీభత్సమైన స్టార్ డమ్, బోలెడన్ని పరిచయాలు, కోట్లలో ఆస్తులు, స్టార్ హీరోలతో ఫ్రెండ్ షిప్పులు. ఇన్ని ఉన్నా కూడా ఇంకా ఏదో కావాలని పరితపించడం అనేది మానవ సహజం. అందుకు సగటు మనిషైనా, సెలబ్రిటీ అయినా మినహాయింపు కాదు. ఈ విషయాన్ని ఇటీవల ఓ స్టార్ డైరెక్టర్ ప్రూవ్ చేశాడు. మొదటి సినిమా ముంచినా తర్వాతి సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన ఓ అగ్ర దర్శకుడు ప్రస్తుతం ఓ స్టార్ హీరోతో సినిమా తెరకెక్కిస్తున్నాడు. భారీ ప్రొడక్షన్ హౌస్, అదిరిపోయే క్యాస్టింగ్ ఇన్ని ఉన్నా.. ఏదో తీరని వెలితితో కొట్టుమిట్టాడుతున్నాడు సదరు స్టార్ డైరెక్టర్. సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఓ అగ్ర కథానాయిక తనతో కలిసిమెలిసి ఉండడం లేదన్న ఒకే ఒక్క సిల్లీ రీజన్ కారణంగా షూటింగ్ ను సరిగా ఫినిష్ చేయకుండా అనవసరంగా తనను నమ్మి కోట్లు ఖర్చు పెడుతున్న నిర్మాతల దగ్గర తిట్లు తినడమే కాకుండా అందరిముందు చీప్ అయిపోతున్నాడు.
షూటింగ్ ప్యాకప్ చెప్పే స్థాయికి చేరుకొన్న ఈ గొడవల్ని మళ్ళీ నిర్మాత కూర్చునీ మరీ సెటిల్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. హీరోయిన్ ఇష్టపడితే ఆమెతో సరదాగా మాట్లాడొచ్చు కానీ.. ఆమెకు ఇష్టం లేకపోయినా ఆమెతో సరదాగా కుళ్ళు జోకులు వేస్తూ కూర్చోవాలనుకోవడం ఏంటో ఎవరికీ అంతుబట్టని ప్రశ్న. డైరెక్టర్ ఇప్పటికైనా హీరోయిన్ మీద కంటే సినిమా మీద కాన్సన్ ట్రేట్ చేస్తే సినిమా అవుట్ పుట్ బాగా వస్తుంది లేదంటే ప్రొజెక్ట్ కోండెక్కిపోతుంది.