“నేల టికెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ” లాంటి వరుస డిజాస్టర్స్ అనంతరం రవితేజ నటిస్తున్న “డిస్కో రాజా” సినిమా రోజుకో సమస్యను ఫేస్ చేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా మూల కథ తమిళంలో రూపొందుతున్న “కోమలి” అనే సినిమా స్టోరీతో మ్యాచ్ అవుతోందట. దాదాపు 16 ఏళ్ళు కోమాలో ఉండిపోయిన కథానాయకుడు ఈ జనరేషన్ ను ఎలా ఆడాప్ట్ చేసుకొన్నాడు, సమాజంలో వచ్చిన మార్పులను చూసి ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది జయం రవి, కాజల్ అగర్వాల్ ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన “కోమలి” కథ. డిస్కో రాజా కథాంశం కూడా ఇంచుమించిగా అలాగే ఉంటుందట.
అయితే.. జయం రవి కంటే రవితేజ కామెడీ టైమింగ్ బాగుంటుంది కాబట్టి.. తమిళంలో కంటే తెలుగులో ఈ కాన్సెప్ట్ బాగా వర్కవుట్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేకపోయినా.. “కోమలి” విడుదలకు రెడీగా ఉండడం.. “డిస్కో రాజా” రిలీజ్ కు ఇంకా చాలా టైమ్ ఉండడం ఇక్కడ సమస్యగా మారింది.