డిస్కో రాజా పోస్ట్ పోన్ అంటూ వస్తున్న రూమర్స్ కు చెక్!

  • January 15, 2020 / 11:44 PM IST

కొన్నాళ్ళ విరామం అనంతరం “రాజా ది గ్రేట్” చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన రవితేజ మళ్ళీ బ్యాక్ అనుకునేలోపు వరుస పరాజయాలతో వెనుకబడిపోయాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో సెకండ్ ఫేజ్ ను జాగ్రత్తగా సెట్ చేసుకుంటున్నాడు రవితేజ. “డిస్కో రాజా, క్రాక్” సినిమాలు రిలీజ్ కి రెడీగా పెట్టుకొన్నాడు. అయితే.. “డిస్కో రాజా” రిలీజ్ విషయంలో చిన్నపాటి డౌటులు ఉండేవి. మరీ ముఖ్యంగా విడుదల విషయంలో క్లారిటీ లేకుండాపోయింది. సినిమా రిలీజ్ జనవరి 24 అని చిత్రబృందం ఒకటికి పదిసార్లు చెబుతున్నప్పటికీ.. విడుదల పోస్ట్ పోన్ అవ్వొచ్చని పలు కథనాలు మీడియాలో, వెబ్ సైట్లలో కనిపిస్తూనే ఉన్నాయి.

దాంతో.. సంక్రాంతి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ చిత్రాన్ని జనవరి 24న విడుదల చేస్తున్నామని కన్ఫర్మ్ చేస్తూనే.. రూమర్స్ కట్టిపెట్టమని డైరెక్ట్ గా చెప్పారు. రవితేజ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించనున్న ఈ చిత్రంలో నభా నటేష్, పాయల్ రాజ్ పుట్ కథానాయికలుగా నటిస్తుండగా.. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus