అండర్ వాటర్ లిప్ లాక్ సీన్.. రెండు రోజుల ట్రైనింగ్!

  • January 6, 2020 / 05:01 PM IST

యంగ్ బ్యూటీ దిశా పటానీ ‘లోఫర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ టాలీవుడ్ లో ఈ బ్యూటీ పెద్దగా క్లిక్ అవ్వలేకపోయింది. కానీ బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం ‘మలంగ్’ అనే సినిమాలో నటిస్తోంది. ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దిశ ఆదిత్య ప్రేయసి పాత్రను పోషిస్తోంది. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫస్ట్‌లుక్ పోస్టర్లు విడుదల అయ్యాయి. అందులో దిశ, ఆదిత్యలు లిప్ లాక్ పోస్టర్ బాగా వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ ని బట్టి సినిమాలో ఇలాంటి సన్నివేశాలు మరిన్ని ఉంటాయని ఆశిస్తున్నారు అభిమానులు. అది నిజమేనని తెలుస్తోంది.

పోస్టర్ లో రిలీజ్ చేసిన సీనే కాకుండా సినిమాలో కొన్ని ముద్దు సన్నివేశాలు కూడా ఉన్నాయట. వాటిలో ఓ కిస్ సీన్ లో నటించడానికి హీరో, హీరోయిన్లకు రెండు రోజుల పాటు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారట. కథ ప్రకారం అండర్ వాటర్ లో ఓ కిస్ సీన్ ఉంటుందట. దాదాపు నిమిషం పాటు ఉండే ఈ సీన్ లో నటించడానికి హీరో, హీరోయిన్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించారు. అండర్ వాటర్ లో అంతసేపు ఉండడానికి ఈ ట్రైనింగ్ తీసుకున్నారు. సింగిల్ షాట్ లో ఈ ముద్దు సన్నివేశాన్ని తెరకెక్కించారట. మోహిత్‌ సూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus