కంటెంట్ లేని సినిమా ఎందుకు చేసావ్ అని హీరోని అడగండి : డిస్ట్రిబ్యూటర్
August 30, 2019 / 01:02 PM IST
|Follow Us
ఇప్పుడు ప్రతీ హీరో ఓవర్సీస్ మార్కెట్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టాడు. అక్కడ మిలియన్ డాలర్లు దాటి కలెక్షన్లు వస్తే ఆ సినిమా 25 శాతం సేఫ్ అయిపోయినట్టే…! అందుకే అక్కడి మార్కెట్ పై ప్రత్యేక శ్రద్ద పెడుతుంటారు మన టాలీవుడ్ హీరోలు. ఇదిలా ఉండగా… మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు మొదటి నుండీ ఓవర్ సీస్ మార్కెట్ బాగా పూర్ . అయితే ‘ధృవ’ ‘రంగస్దలం’ చిత్రాలు హిట్లు కావడంతో మంచి మార్కెట్ ఏర్పడింది. ‘ధృవ’ 1 మిలియన్ దాటగా… ‘రంగస్థలం’ చిత్రం ఏకంగా 3.5 మిలియన్ డాలర్లు సాధించి నాన్ బాహుబలి గా నిలిచింది. దీంతో ‘వినయ విధేయ రామా’ చిత్రానికి మంచి మార్కెట్ జరిగింది.
దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఓవర్ సీస్ లో చాలా చెత్త ట్రాక్ రికార్డ్. అయినప్పటికీ చరణ్ సినిమా కాబట్టి గట్టిగానే పెట్టి కొన్నారు డిస్త్రిబ్యూటర్లు. కానీ ‘వినయ విధేయ రామా’ డిజాస్టర్ కావడం కనీసం ప్రీమియర్ లకు మంచి కలెక్షన్లు రాకపోగా… మొదటి రోజు కలెక్షన్లు కూడా రాకపోవడం గమనార్హం. రొటీన్ రొట్ట స్టోరీ అంటూ అక్కడ తిప్పికొట్టారు అక్కడి ప్రేక్షకులు. అయితే చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు సరిగ్గా ‘వినయ విధేయ రామా’ చిత్రాన్ని ప్రమోట్ చేయలేదని సోషల్ మీడియాలో తిట్ల దండకం మొదలు పెట్టారు. ఇంతకాలం సైలెంట్ గా భరిస్తూ వచ్చిన డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు సహనం కోల్పోయాడు. ట్విట్టర్ లో ఆ డిస్ట్రిబ్యూటర్ స్పందిస్తూ… “మాకు 10 శాతం ఇన్విస్టిమెంట్ కూడా రికవరీ కాలేదు. మేము చాలా నష్టపోయాం.
మా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నే క్లోజ్ చేసేశాం. మేము చాలా కాలం నుంచి చూస్తూ వస్తున్నాం. ఇంకా కొందరు వారికి ఇష్టం వచ్చిన చెత్త భాషలో మాట్లాడుతున్నారు. ఎవరికీ డబ్బు నష్ట పోవాలని ఉండదు. ‘వినయ విధేయ రామా’ సినిమా డిజాస్టర్. మేము చాలా డబ్బు నష్టపోయాం. ఇంకా మీ చేత ట్రోల్ చేయించుకోవటానికి సిద్దంగా లేము. కంటెంట్ లేని సినిమా ఒప్పుకున్నావంటూ హీరోని అడిగే ధైర్యం లేదు మీకు. ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అయిన మేము ఈ విషయంలో చాలా సిగ్గుపడుతున్నాం. చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఓవర్ సీస్ లో నష్టపోతున్నారు. బ్లైండ్ గేమ్ లు ఓవర్ సీస్ లో ఆగే రోజు వస్తుంది” అంటూ తన కడుపుమంట బయట పెట్టాడు.