విజయ్ ని నమ్ముకుంటే వర్కవుట్ అవుతుందా..?

  • December 8, 2020 / 11:31 AM IST

సినిమా ఇండస్ట్రీపై కరోనా ఎంతగా ప్రభావం చూపిందో తెలిసిందే. ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలు కరోనా కారణంగా వెనక్కి తగ్గాయి. ఈ లిస్ట్ లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా కూడా ఉంది. నిజానికి ఈ ఏడాది వేసవిలో సినిమా విడుదల కావాలి కానీ వాయిదా పడింది. ఇప్పుడు థియేటర్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు నడుస్తాయి అప్పుడే ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురావాలని చూస్తున్నారు. ప్రస్తుతం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి.

సంక్రాంతికి ఏమైనా నూరు శాతం ఆక్యుపెన్సీ సాధ్యమవుతుందేమోనని చూస్తున్నారు కానీ ఇప్పటివరకు అలాంటి సంకేతాలు రాలేదు. దీంతో ‘మాస్టర్’ సినిమాను వేసవికి రిలీజ్ చేద్దామని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు నచ్చడం లేదు. మళ్లీ థియేటర్లు పుంజుకోవాలంటే ‘మాస్టర్’ లాంటి భారీ చిత్రం విడుదల కావాలని.. అది కాకుండా వేరే సినిమాలు వచ్చినా కొత్త ఏడాదిలో కూడా పరిస్థితి మారదని.. ప్రేక్షకులు థియేటర్లకు అలవాటు పడరని వాళ్లు ఆందోళన చెందుతున్నారు.

ఈ క్రమంలో తమిళనాడులో పేరున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ప్రత్యేకంగా విజయ్ ని కలిశారు. ఎలాగైనా ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలని కోరారు. దీని కారణంగా వేలాది కుటుంబాలకు మళ్లీ ఉపాధి దొరికి అందరూ బాగుపడతారని విజయ్ వద్ద విన్నవించుకున్నారు. వారి బాధను అర్ధం చేసుకున్న విజయ్ నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారట. మరి విజయ్ రికమెండేషన్ నిర్మాతల దగ్గర ఎంతవరకు పని చేస్తుందో చూడాలి.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus