సరైనోడు చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్లోకి రానుంది. బ్రాహ్మణ యువకుడిగా, స్టైలిష్ గా డీజే లో బన్నీ అదరగొట్టనున్నట్లు టీజర్, ట్రైలర్ స్పష్టం చేశాయి. అందుకే ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ క్రేజీ సినిమా కథ ఇదే నంటూ ఫిలిం నగర్లో ఓ స్టోరీ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆంధ్రలో నడుస్తున్న ఓ బడా రియల్ ఎస్టేట్ కంపెనీ స్కాంను బేస్ గా చేసుకుని ఈ కథను తీర్చిదిద్దారని తెలిసింది.
పెద్దలంతా తెర వెనుక ఉండి నడిపించిన ఈ కుంభకోణంలో సామాన్యులు నిట్టనిలువునా మునిగిపోయారు. ఈ భూ కుంభకోణం నిగ్గు తేల్చే క్రమంలో యుద్ధం శరణం గచ్చామి అంటూ డీజే రంగంలోకి దిగుతాడన్నది టాక్. ఈ కథ నిజమో కాదో మూడు రోజుల్లో తెలియనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించిన ఈ మూవీలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.