Khiladi, DJ Tillu: ఆ విధంగా ఖిలాడి నష్టపోక తప్పదా?
February 13, 2022 / 06:21 PM IST
|Follow Us
రమేష్ వర్మ డైరెక్షన్ లో రవితేజ హీరోగా డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఖిలాడి మూవీ ఈ నెల 11వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. తొలిరోజు 4 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఈ సినిమా కలెక్షన్లను సాధించగా ఈ సినిమాకు పోటీగా నిన్న విడుదలైన డీజే టిల్లు సినిమాకు ఎవరూ ఊహించని విధంగా పాజిటివ్ టాక్ వచ్చింది.
నైజాం ఏరియాలో తొలిరోజే డీజే టిల్లు బ్రేక్ ఈవెన్ సాధించిందంటే ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ సాధించిందో సులువుగా అర్థం చేసుకోవచ్చు. డీజే టిల్లు సక్సెస్ ప్రభావం ఖిలాడి సినిమాపై భారీస్థాయిలో పడే ఛాన్స్ అయితే ఉంది. వీకెండ్ తర్వాత ఖిలాడీ ప్రదర్శితమవుతున్న కొన్ని మెయిన్ థియేటర్లు డీజే టిల్లుకు కేటాయించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. తొలిరోజే డీజే టిల్లు 3 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది.
వీకెండ్ తర్వాత ఖిలాడిపై డీజే టిల్లు పై చేయి సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కు ఈ సినిమా వల్ల భారీ మొత్తంలో లాభాలు రావడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పరిమిత బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కగా భారీస్థాయిలో ప్రమోషన్స్ చేయడం ఈ సినిమాకు కలిసొచ్చింది. థమన్ మ్యూజిక్ అందించడం ఒక విధంగా ఈ సినిమాకు ప్లస్ అయింది.
కామెడీ సన్నివేశాలు ఉండటం డీజే టిల్లు సక్సెస్ కు కారణమైంది. గతేడాది ఫిబ్రవరి 12వ తేదీన విడుదలైన ఉప్పెన సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకోగా ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన విడుదలైన డీజే టిల్లు అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడం గమనార్హం. ఫుల్ రన్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు డీజే టిల్లు సినిమాతో కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని చెప్పవచ్చు. డీజే టిల్లు సక్సెస్ తో సిద్ధు జొన్నలగడ్డకు సినిమా ఆఫర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది.