Samantha Dress Cost: బాలి వెకేషన్ లో సమంత ధరించిన డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
July 27, 2023 / 12:33 PM IST
|Follow Us
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సమంత ప్రస్తుతం ఏడాది పాటు సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు. గతంలో ఈమె మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డారు.అయితే ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోల్పోవడం కోసమే సమంత ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించారు. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చినటువంటి ఈమె బాలి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా తన వెకేషన్ కి సంబంధించిన అన్ని ఫోటోలను సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా సమంత ఒక గ్రీన్ కలర్ ట్రెండీ వేర్ ధరించిన ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ డ్రెస్ లో చాలా స్టైలిష్ లుక్ సమంత సందడి చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటో వైరల్ గా మారడంతో ఈమె ధరించిన ఈ డ్రెస్ ఖరీదు ఎంత అంటూ నేటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఇక సమంత ధరించిన ఈ గ్రీన్ కలర్ డ్రెస్ కల్ట్ గయా కామెరూన్ నిట్ బ్రాండ్ కి చెందినది.
ఈ డ్రెస్ ఖరీదు 37,790 రూపాయలని తెలుస్తుంది. ఇలా సమంత ధరించిన ఈ సింపుల్ డ్రెస్ ధర ఏకంగా 37 వేల రూపాయలని తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే ఈమె విజయ్ దేవరకొండ సరసన శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.
ఈ సినిమాతో పాటు సమంత (Samantha) సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు .ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకున్న అనంతరం ఈమె ఇతర సినిమాలకు కమిట్ అవ్వకుండా ఏకంగా సినిమాలకు ఏడాది పాటు విరామం ఇచ్చారు. ఇలా బ్రేక్ ఇచ్చినటువంటి సమంత ప్రకృతిని ఆస్వాదిస్తూ పలు వెకేషన్లకి వెళ్తూ తన ఆరోగ్యంపై దృష్టి పెట్టారని తెలుస్తుంది.