Vaishnavi Chaitanya: దేవుడా.. వైష్ణవి చైతన్య పేరు వెనుక ఏకంగా ఇంత కథ ఉందా?

  • July 16, 2023 / 03:59 PM IST

బేబీ సినిమా సక్సెస్ సాధించడంతో పాటు ఈ సినిమాలో నటించిన వైష్ణవి చైతన్య నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. బేబీ సినిమాలోని వైష్ణవి చైతన్య పాత్రకు ఈ నటి ప్రాణం పోశారు. అయితే ఈ నటి పేరుకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైష్ణవి చైతన్య మాట్లాడుతూ తన పేరుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలిపారు. తన అసలు పేరు చైతన్య అని ఆమె అన్నారు. ఆ పేరు తనకు నచ్చకపోవడంతో పేరుకు ముందు వైష్ణవి అని యాడ్ చేసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

నేను తెలుగమ్మాయినేనని నాది హైదరాబాద్ లోని చాంద్రయాణగుట్ట అని వైష్ణవి చైతన్య వెల్లడించారు. జన్మ నక్షత్రం ప్రకారం సి రావడంతో చైతన్య అని పేరు పెట్టడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. చైతన్య పేరు కంటే వైష్ణవి పేరు నచ్చడంతో పేరు మార్చుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. నేను కేవలం ఇంటర్ వరకు మాత్రమే చదివానని వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చారు. బేబీ సినిమా సక్సెస్ తో స్టార్ స్టేటస్ ను అందుకున్న వైష్ణవి ఈ సినిమా ద్వారా గ్లామరస్ రోల్స్ లో నటించడానికి కూడా సిద్ధమేనని చెప్పేశారు.

వైష్ణవి చైతన్యను (Vaishnavi Chaitanya) అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. వైష్ణవి చైతన్యకు ఇండస్ట్రీ వర్గాల నుంచి ప్రశంసలు దక్కుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా సక్సెస్ తో వైష్ణవి చైతన్య రెమ్యునరేషన్ పెరిగే అవకాశం ఉంది. వైష్ణవి చైతన్యకు క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆమె కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇతర ఇండస్ట్రీలపై వైష్ణవి దృష్టి పెడితే ఆమె రేంజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. వైష్ణవి చైతన్య టాలీవుడ్ ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఛాన్స్ ఇస్తే తెలుగమ్మాయిలు సత్తా చాటుతారని వైష్ణవి ప్రూవ్ చేశారు.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus