వేల కోట్లకు అధిపతి అయిన చిరంజీవి హీరోయిన్ ఎవరంటే..?
March 18, 2023 / 09:10 PM IST
|Follow Us
సామాజిక మాధ్యమాల కారణంగా ఒకప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్స్‌గా ఓ వెలుగు వెలిగి.. కొంత కాలంగా పరిశ్రమకు దూరంగా ఉంటూ.. ఫ్యామిలీతో గడుపుతున్న అప్పటి సెలబ్రిటీల గురించి తెలుస్తోంది.. అప్పట్లో ప్రేక్షకాభిమానులను అలరించి ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు సీనియర్ నటీనటులు.. అలాగే ఇప్పుడు కథానాయిక మాధవి గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.. అస్సలు పోల్చుకోలేనంతగా మారిపోయారామె.. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు మాధవి..
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో పుట్టి పెరిగిన మాధవి అసలు పేరు కనక మహాలక్ష్మీ.. చిన్నప్పటినుంచే భరతనాట్యం పట్ల ఆసక్తి ఉండడంతో తల్లి శిక్షణ ఇప్పించారు.. దీంతో తన 8వ ఏటనుండే ఆమె ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించి.. 300లకు పైగా స్టేజ్ పర్ఫార్మెన్స్లిచ్చి ఆకట్టుకున్నారు.. ఆమె స్కూలింగ్ డేస్‌లోనే సినిమాల్లోకి ఎంటర్ అవడం విశేషం.. అబిడ్స్‌లోని స్కూల్లో చదువుతున్న సమయంలో ఓ రోజు దర్శకరత్న దాసరి నారాయణరావు, మాధవి చదువుతున్న పాఠశాలకు వెళ్లారు..
ఆమె నాట్యం చూసి మంత్ర ముగ్దులై.. తాను తీసిన ‘తూర్పు పడమర’ చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు.. అలా 13 ఏళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మాధవికి వరసగా ఛాన్సులు వచ్చాయి.. మెగాస్టార్ చిరంజీవితో ఆమెది సూపర్ జోడీ.. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ , ‘కోతల రాయుడు’, ‘ప్రాణం ఖరీదు’, ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బ’, ‘ఖైదీ’, ‘బిగ్ బాస్’ లాంటి సినిమాల్లో చిరుతో కలిసి నటించారు.. ఇక ‘మాతృదేవోభవ’ తో ప్రేక్షకుల మనసుల్లో చెరుగని ముద్ర వేశారు..
ఇదిలా ఉంటే మాధవి.. ఆధ్యాత్మిక గురువు రామస్వామికి భక్తురాలు.. ఆయన చెప్పడంతోనే బిజినెస్మెన్ అయిన రాల్ఫ్ శర్మని పెళ్లి చేసుకున్నారు.. మ్యారేజ్ తర్వాత అమెరికాలో సెటిలైపోయారు.. వీళ్లకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని సమాచారం.. వికీపీడియాలో నలుగురు కూతుర్లని ఉంది.. పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక బిజినెస్ మీద ఇంట్రెస్ట్ పెరగడంతో.. భర్త మెడికల్ కంపెనీతో పాటు రెస్టారెంట్స్ చూసుకుంటూ వాటిని విజయపథంలో నడిపించిన మాధవి ఆస్తి ఇప్పుడు వేల కోట్లలో ఉంటుందట..