Samantha: హెల్త్ గురించి సమంత పోస్టు.. కామెంట్ చేసిన డాక్టర్ సారీ చెప్పారు.. కానీ..
July 6, 2024 / 06:33 PM IST
|Follow Us
సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఓ ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వైద్యం విషయంలో సమంత (Samantha) పెట్టిన ఓ పోస్టుకు డాక్టర్ లివర్ డాక్ అనే వ్యక్తి రిప్లై ఇచ్చారు. దానికి సమంత హర్ట్ అయి మరో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు తాజాగా డాక్టర్ లివర్ డాక్ మరో పోస్ట్ పెట్టారు. తన వ్యాఖ్యల విషయంలో సమంత బాధపడినట్లు అర్థమవుతోందని అంటూ.. ఆమెకు సారీ చెప్పారు. అయితే ఆమెకు మాత్రమే సారీ చెప్పారు.
సమంతను విమర్శించినందుకు క్షమాపణలు చెప్పిన డాక్టర్ లివర్ డాక్.. ఆమెకు వైద్యం చేస్తున్న వైద్యుడు మీద మాత్రం విమర్శలు చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా సమంతకు, డాక్టర్ లివర్ డాక్‌కు మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న మాటల యుద్ధానికి బ్రేక్ పడినట్లు అయింది. అయితే వైద్యం విషయంలో డాక్టర్ లివర్ డాక్ చేసిన విమర్శలు అలానే ఉండటంతో దీనిపై ఎలాంటి చర్చ జరుగుతుందా అనే డౌట్స్ మొదలయ్యాయి.
సమంత ఆరోగ్య పరిస్థితి అర్థమైంది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆమె చెప్పిన హెల్త్ టిప్ సరైంది కాదు. అయితే దానిని ఖండించిన తీరుకు ఆమె బాధపడ్డారని నాకు అర్థమైంది. దానికిగాను క్షమాపణలు కోరుతున్నాను. అయితే ఆమెకు ఆ చికిత్స చెప్పిన డాక్టర్‌ది తప్పు. సొంత లాభం కోసం ఆయన సమంత ద్వారా హనికరమైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు అని డాక్టర్ లివర్ డాక్ అన్నారు.
సమంతకు వైద్యం అందిస్తున్న ఆయన ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ కాదని, ప్రకృతి వైద్యుడని డాక్టర్ లివర్ డాక్ తెలిపారు. ఆయన గతంలోనూ ప్రజారోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను పోత్సహించారని, ఆ మేరకు ఆయనపై ప్రభుత్వం చర్చలు తీసుకుందని గుర్తు చేశారు. కేవలం డాక్టర్ లివర్ డాక్ ఒక్కరే కాదు.. చాలామంది ఇతర వైద్యులు కూడా ఇదే మాట అంటున్నారు. అయితే ఆ విధానం సరికాదని చెబుతున్న నేపథ్యంలో అదేంటి అనేది మేమూ రాయడం లేదు.