రాజ్ తరుణ్ అంత భయపెడతాడా..?

  • September 6, 2016 / 09:30 AM IST

హ్యాట్రిక్ హిట్లతో దూసుకొచ్చిన కుర్రహీరో రాజ్ తరుణ్ కి తర్వాత వచ్చిన రెండు సినిమాల ఫలితాలు తారుమారయ్యాయి. అయినప్పటికీ రెమ్యూనరేషన్ పెంచాడని కొద్ది రోజుల క్రితం వార్తలొచ్చాయి. దాంతో కొంతమంది నిర్మాతలు ఇతగాడితో సినిమా అంటే భయపడ్డారట. తర్వాత రెండు సినిమాలు ఒకేసారి లైన్లోకి రావడంతో అవన్నీ గాల్లో కలిసిపోయాయి. అయినా గానీ ‘బీ వేర్…’ అన్న కాషన్ బోర్డ్ మాత్రం అలాగే వేలాడుతుందట.

అదేమిటని ఆరా తీస్తే.. ‘దొంగాట’ చిత్ర దర్శకుడు వంశీకృష్ణతో రాజ్ తరుణ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ ప్రకటించనప్పటికీ వినాయకచవితి సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ఓ డజను కుక్కలతో కూర్చొని పోజివ్వడంతో పాటు “బీ వేర్ ఆఫ్ కిట్టు” అన్న ట్యాగ్ ని జత చేశాడు. ఈ ట్యాగ్ ఆసక్తికరంగా మారిందిప్పుడు. తెలియవస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రాజ్ తరుణ్ పెంపుడు కుక్కలు దొంగగా కనిపిస్తాడట. ఎందుకైనా మంచిది మీ పెంపుడు కుక్కలపై ఓ కన్నేసి ఉంచండి…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus