Double Ismart Collections: మంచి ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘డబుల్ ఇస్మార్ట్’.!
August 16, 2024 / 12:55 PM IST
|Follow Us
పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ,రామ్ (Ram) కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) అనే మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) రూపొందింది. కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్ (Sanjay Dutt) విలన్ గా నటించాడు. టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మణిశర్మ (Mani Sharma) సంగీతంలో రూపొందిన పాటలు కూడా సినిమా హైప్ కి పనికొచ్చాయి. అందుకే ఆగస్టు 15న(నిన్న) రిలీజ్ అయిన ఈ సినిమా పర్వాలేదు అనిపించే టాక్ రాబట్టుకుంది.
హాలిడే కూడా కలిసి రావడంతో మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది ‘డబుల్ ఇస్మార్ట్’. ఒకసారి (Double Ismart Collections) ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.49 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.50 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ సినిమా రూ.6.99 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.43.01 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.