డాక్టర్ మోహన్‌బాబు చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’ షూటింగ్ ప్రారంభం
October 23, 2020 / 02:59 PM IST
|Follow Us
కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్‌బాబు చాలా రోజుల తర్వాత హీరోగా నటిస్తోన్న దేశభక్తి కథా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని మోహన్‌బాబు నివాసంలో శుక్రవారం చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు విరానికా మంచు, ఐరా, అవ్రమ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, లక్ష్మీ మంచు, విద్యానిర్వాణ సంయుక్తంగా క్లాప్ నిచ్చారు. విష్ణు మంచు గౌరవ దర్శకత్వం వహించారు. అరియానా, వివియానా సంయుక్తంగా స్క్రిప్టును డైరెక్షనల్ టీమ్‌కు అందించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సైతం ఈరోజే మొదలైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ‘సన్ ఆఫ్ ఇండియా’ టైటిల్ పోస్టర్‌కు ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది.
ఇదివరకెన్నడూ కనిపించని అత్యంత పవర్ఫుల్ రోల్లో డాక్టర్ మోహన్‌బాబు నటిస్తోన్న ఈ తరహా కథ కానీ, ఈ జానర్ సినిమా కానీ ఇప్పటివరకూ టాలీవుడ్లో రాలేదు. మేస్ట్రో ఇళయరాజా సంగీత స్వరాలు అందిస్తోన్న ఈ చిత్రానికి సర్వేష్ మురారి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. డాక్టర్ మోహన్‌బాబు స్వయంగా స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్న ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు, తోటపల్లి సాయినాథ్ సంభాషణలు రాస్తున్నారు. సుద్దాల అశోక్‌తేజ పాటలు రాస్తుండగా, గౌతంరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మోహన్‌బాబుకు స్టైలిస్ట్‌గా విరానికా మంచు వ్యవహరిస్తుండటం విశేషం. ఆర్ట్ డైరెక్టర్‌గా చిన్నా పనిచేస్తున్నారు.