Drushyam: హాలీవుడ్‌కి వెళ్లి తొలి సినిమా మన తెలుగు సినిమానే… ఏదంటే?
March 2, 2024 / 01:25 PM IST
|Follow Us
హాలీవుడ్‌కి రీమేక్‌గా వెళ్తున్న తొలి ఇండియన్ మూవీ ‘దృశ్యం’ అంటూ గత కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నాం. మలయాళ సినిమా సాధించిన ఘనత ఇది అంటూ పొంగిపోతున్నాం. అయితే ఇంగ్లిష్‌లో రీమేక్ అయిన తొలి ఇండియన్ సినిమా మనదే అని సినీ విశ్లేషకుల గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమాకే తొలి గౌరవం దక్కింది అనేది వారి మాట. అయితే ఆ సినిమా అక్కడ సరైన విజయం అందుకోకపోవడంతో ఆ ఘనత మనకు గుర్తులేదు అంటున్నారు.
ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ సృష్టించిన (Drushyam) ‘దృశ్యం’ సినిమా… త్వరలో హాలీవుడ్లో రీమేక్ కాబోతోందనే వార్త వచ్చిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ బస్టర్ ఇప్పటికి రెండు సినిమాలుగా వచ్చింది. మూడో ‘దృశ్యం’ త్వరలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా సాధించిన విజయం చెప్పాలంటే తెలుగు, తమిళం, హిందీ, కన్నడలో ఈ సినిమాను రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్, కన్నడలో రవి చంద్రన్, తమిళంలో కమల్ హాసన్ చేశారు.
అయితే సౌత్ మూవీని మొట్టమొదటి సారి ఇంగ్లిష్‌లో తీస్తున్నారు అనేది వారి వాదన. అయితే 12 ఏళ్ల క్రితం మన తెలుగు దర్శకుడు ఒక ఎమోషనల్ మూవీతో ఆ ఫీట్ సాధించారు. ఆయన ఎస్వీ కృష్ణారెడ్డి. 1997లో శ్రీకాంత్, రమ్యకృష్ణ, హీరా ప్రధాన పాత్రల్లో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆహ్వానం’ భార్యకు ఇష్టం లేకపోయినా భర్త విడాకులు కోరుతున్నప్పుడు పెళ్లి లాగే విడిపోయే తతంగం చేసి… ఆయన కళ్లు తెరిపిస్తుంది భార్య.
ఈ సినిమాను 2012లో ‘డివోర్స్ ఇన్విటేషన్’ పేరుతో రీమేక్ చేశారు. 2012 నవంబర్ 15 విడుదలైన ఈ ఇంగ్లిష్ సినిమాకు అక్కడ సరైన స్పందన రాలేదు. అయితే ఈ సినిమాను యాజ్ ఇట్ ఈజ్ అక్కడ తీయకపోయినా మూలం మన సినిమానే అంటున్నారు నెటిజన్లు. కాబట్టి మనమే ముందు బాస్.