Acharya Tickets: ‘ఆచార్య’ పూర్ బుకింగ్స్ కు కారణం అదేనా?
April 27, 2022 / 02:47 PM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఆచార్య’. ‘మాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు నిర్మించిన ఈ మూవీకి చరణ్ సహా నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా ఈ మూవీలో అతను సిద్ధ అనే పాత్రలో కూడా కనిపించారు చరణ్. విడుదల చేసిన సాంగ్ ప్రోమోలు, టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ఈ సినిమాని థియేటర్లలో చూసే ఇంట్రెస్ట్ ప్రేక్షకులకు లేదా అనే అనుమానం కూడా కలుగుతుంది.
అందుకు ప్రధాన కారణం ‘బుక్ మై షో’ లో ‘ఆచార్య’ బుకింగ్స్ దారుణంగా ఉండడం వలనే. మెగాస్టార్ చిరంజీవి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి అనగానే హాట్ కేకుల్లా అమ్ముడవుతూ ఉంటాయి. కానీ ‘ఆచార్య’ బుకింగ్స్ మాత్రం చాలా డల్ గా ఉన్నాయి. ఇందుకు కారణాలు లేకపోలేదు. తెలంగాణలో ‘ఆచార్య’ టికెట్ రేట్లు పెంచారు. మల్టీప్లెక్సుల్లో ‘ఆచార్య’ టికెట్ ధర రూ.350 గా ఉంది. “కరోనా మహమ్మారితో ప్రతి రంగం కుంటుపడింది.రూ.50 కోట్ల వడ్డీలు అన్న మాట ఎప్పుడైనా విన్నారా?
ఈ సినిమాకి మేం కట్టాం. అవి ఎవరిస్తారు చెప్పండి. ప్రభుత్వాలు కనికరించి టికెట్ హైక్స్ జీవోలు ఇస్తే, మనకు ఇంత వినోదం ఇస్తే మనం కూడా పది రూపాయలు ఎక్కువ ఇద్దామని ప్రేక్షకులు చేస్తున్నారు. ఇది అడుక్కోవడం కాదు. ఆపద వచ్చినప్పుడు చేయూత ఇవ్వడం లాంటిది,” అంటూ చిరంజీవి చెప్పారు.నిజమే చిరు చెప్పిందాంట్లో తప్పేమి లేదు. కానీ ఫిబ్రవరి ఎండింగ్ నుండీ ఏప్రిల్ ఎండింగ్ వరకు.. ‘భీమ్లా నాయక్’ ‘రాధే శ్యామ్’ ‘ఆర్.ఆర్.ఆర్’ ‘కె.జి.ఎఫ్ 2’ వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి.
వాటన్నిటికీ తెలంగాణలో టికెట్ రేట్లు పెంచారు. ఇప్పుడు ‘ఆచార్య’ కి కూడా అంత పెట్టాలా అనే ఆలోచనలో ప్రేక్షకులు ఉన్నారు. మరో పక్క పరీక్షల సీజన్. కరోనా 4వ వేవ్ భయం కూడా జనాల్లో ఉంది. అందుకే ‘ఆచార్య’ బుకింగ్స్ డల్ గా ఉన్నట్టు స్పష్టమవుతుంది. సినిమాకి హిట్ టాక్ వస్తే తప్ప భారీ ఓపెనింగ్స్ సాధ్యం కాదనే చెప్పాలి.