Radhe Shyam Songs: ‘రాధే శ్యామ్’ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తున్న ‘ఈ రాతలే’ వీడియో సాంగ్..!

  • February 25, 2022 / 01:00 PM IST

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధే శ్యామ్’. కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడుతూ వస్తున్న పెద్ద సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని మార్చి 11న విడుదల చేయబోతున్నట్టు ప్రకరించారు నిర్మాతలైన ‘గోపికృష్ణా మూవీ’ ‘యూవీ క్రియేషన్స్’ వారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రోమోలు అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడమే కాకుండా సినిమా పై ఉన్న అంచనాల్ని మరింతగా పెంచాయనే చెప్పాలి.

Click Here To Watch

అయితే కొద్దిరోజుల నుండీ ‘రాధే శ్యామ్’ ప్రమోషన్ల హడావిడిని మరింతగా పెంచారు ‘రాధే శ్యామ్’ మేకర్స్. వాలెంటైన్స్ డే రోజునాడు స్పెషల్ గ్లిమ్ప్స్ ను విడుదల చేసి అందరినీ సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. ‘రాధే శ్యామ్’ పై అంచనాల్ని మరింతగా పెంచిన ‘ఈ రాతలే’ పాటకి సంబంధించిన వీడియో సాంగ్ ను తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. 2 నిమిషాల 19 సెకండ్ల నిడివి గల ఈ వీడియో సాంగ్ ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

‘రాధే శ్యామ్’ అనేది ఓ మేజికల్ లవ్ స్టోరీ అని ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు. విక్రమాదిత్య, ప్రేరణలు ఒకర్నొకరు చూసుకోకుండానే ప్రేమించుకుంటారు. అది ఎలా అనేది సాంపుల్ గా ఈ పాట ద్వారా చూపించారు. ఈ పాట చూడ్డానికి మంచి ఫీల్ ను కలిగిస్తుంది. విధిని ఎదురించి ప్రేమ నిలబడగలదా? నిలబడి గెలవగలదా? అనే థీమ్ తో తెరకెక్కిన ‘రాధే శ్యామ్’ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఈ పాట మరింత ఆసక్తిని పెంచిందనే చెప్పాలి. మీరు కూడా ఓ లుక్కేయండి :

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!


‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus