కాస్టింగ్ కౌచ్ పై ఈషా షాకింగ్ కామెంట్స్..!

  • April 22, 2019 / 04:56 PM IST

‘మీటూ’ ఉద్యమం ఇండియా వైడ్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం కాస్టింగ్ కౌచ్ ఉందని, పలానా దర్శకుడు, నిర్మాత, హీరో తమ పై లైంగిక దాడులు చేసారని మీడియా ముందుకొచ్చి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కొందరు సీనియర్ హీరోయిన్లు మాత్రం అలాంటిదేమీ లేదని ఇండస్ట్రీ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు మరోసారి నటి ఈషా రెబ్బ కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన కామెంట్స్ మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.

ఈషా తెలుగమ్మాయి అయినప్పటికీ హీరోయిన్ గా మాత్రం సరైన గుర్తింపు తెచుకోలేకపోయింది. అయితే ఈమెకు మంచి క్రేజ్ ఉంది. అందుకే నటి గా గుర్తింపు తెచ్చుకునేవరకూ తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈషా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందా..? అని ఆమెని ప్రశ్నించగా.. ‘ఎస్’ అంటూ సమాధానం చెప్పడం అందరినీ షాక్ గు గురిచేసింది. ఈషా మాట్లాడుతూ.. “అన్ని రంగాల్లో ఉన్నట్లే సినిమా ఇండస్ట్రీలో కూడా రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది. అయితే దీన్ని ఎదుర్కోవడానికి ఓ టెక్నిక్ ఫాలో అవుతున్నాను. అదేంటంటే.. నాకు ఇబ్బందిగా అనిపించే పరిస్థితులు, మనుషులు ఎదురైతే అక్కడ నుండి తప్పుకుంటాను. అలానే పక్కవారికి ఇబ్బంది కలగకుండా ‘నో’ చెప్పడం నేర్చుకున్నాను” అంటూ సమాధానమిచ్చింది. అందుకే ఈ అమ్మడికి మంచి ఆఫర్లు రావట్లేదంటూ కొందరు ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus