వైరలవుతున్నఈషా కొత్త ఫోటోలు

  • May 6, 2019 / 04:59 PM IST

చెప్పుకోడానికి భారీ హిట్లు లేవు.. చేతినిండా అవకాశాలున్నా.. పెద్ద అవకాశాలు మాత్రం ఏమీ లేవు.. గ్లామర్ షో చేసేసి పెద్ద పెద్ద ఆఫర్లు కొట్టేద్దాం అనే ఆరాటం అస్సలు లేదు.. అయినప్పటికీ ఈషా రెబ్బా అంటే ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముంబై బ్యూటీలకి నేను ఏమాత్రం తక్కువ కాదు అనేలా తన సోషల్ మీడియాలో మంచి యాక్టీవ్ గా ఉంటూ తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది మన తెలుగమ్మాయి. ఈసారి కూడా కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ అమ్మడు. ప్రత్యేకంగా డెనిమ్ కోసం ఫోటో షూట్లో పాల్గొన్నట్టు ఈ ఫోటోలున్నాయి.

ఈ ఫోటోలను షేర్ చేస్తూ “సరైన డెనిమ్ జీన్స్ లో ఒక అమ్మాయి ప్రపంచాన్ని జయించగలదు అంటారు కానీ అదేం లేదు. నేను చెప్పేదేంటంటే ఒక అమ్మాయి అనుకుంటే ఎలాగైనా ప్రపంచాన్ని జయించగలదు” అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్యాప్షన్ కు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఈ ఫోటోలలో చిరిగిన జీన్స్.. బ్లూ షర్ట్ తో చాలా గ్లామర్ గా కనిపిస్తుంది. ఈ ఫ్టోలు చూసిన వారెవరైనా సరే ఈమె గ్లామర్ కు ఫిదా అయిపోవాల్సిందే. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నెటిజన్లు తెగ లైకులు కొడుతూ ‘సూపర్ ఈషా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus