తెలుగు హీరోయిన్స్ సంప్రదాయంగా ఉంటారు కానీ.. హాట్ లుక్స్ వారికి సూట్ కావు.. అందుకే కమర్షియల్ సినిమాల్లో ఛాన్స్ ఇవ్వడం లేదని కొంతమంది దర్శకనిర్మాతల అభిప్రాయం. కానీ అందాల ఆరబోతకు తెలుగు హీరోయిన్ సిద్ధమైతే.. ఎవరూ పోటీకి రారని నేటితరం హెచ్చరిస్తోంది. “అంతకుముందు ఆ తరువాత” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా.. “అమీతుమీ”తో మంచి నటిగా పేరుతెచ్చుకుంది. అలాగే “అ” మూవీలో విభిన్నమైన పాత్రలో మెప్పించింది. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అరవింద సమేత వీర రాఘవ”లో ఈషా రెండో హీరోయిన్ గా నటిస్తోంది.
ఆమె కెరీర్ లో ఇదే పెద్ద సినిమా. స్టార్ హీరో పక్కన నటిస్తుండడంతో అందుకు తగ్గట్టు మారిపోయింది. గ్లామర్ డోస్ పెంచింది. హీట్ పుట్టించే డ్రస్సుల్లో ఫోటోలకు ఫోజులిస్తోంది. ఈ ఫోటోలను చూస్తుంటే ఎన్టీఆర్ సినిమాలో పూజా హెగ్డేకి అభినయంలోనే కాదు అందంలోనూ గట్టి పోటీ ఇవ్వబోతున్నట్టు అర్ధమవుతోంది. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇప్పుడు ఈషా రెబ్బ, ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే మాత్రం ఈషా రెబ్బా మరిన్ని స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకోవడం గ్యారంటీ.