Home » Featured Stories » Eleven Tollywood Directors Who Deserve A Decent In Thier Carrer
ఈ దర్శకులకి అర్జెంటుగా ఓ హిట్టు కావలెను
May 2, 2019 / 06:54 PM IST
‘కర్ణుడి చావుకి కోటి కారణాలన్నట్టు.. ఒక సినిమా ప్లాపవ్వడానికి కూడా చాలా కారణాలుంటాయి. కథ బాగోక పోవడం, కథ బాగున్నా ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్, ఒక వేళ అన్నీ బాగున్నా ఆ చిత్రం సరైన సమయంలో విడుదల కాకపోవడం.. వంటివి ఆ చిత్రం ప్లాపుకి కారణాలవుతాయి. ఇక ఓ సినిమా ప్లాపయింది అంటే.. ఆ చిత్రం హీరో, నిర్మాతకన్నా దర్శకుడి కెరీర్ పైనే ఎఫెక్ట్ పడుతుంది అనడంలో సందేహం లేదు. ఒక వేళ ఆ దర్శకుడి తరువాతి చిత్రాలు కూడా ప్లాపయితే… ఫేడౌట్ అయిపోయిన డైరెక్టర్లు లిస్టులో వేసేస్తారు. ఇక ఆ డైరెక్టర్ పనైపోయిందని కూడా చెప్పేస్తుంటారు. అయితే ఎలా అయినా హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని కొందరు డైరెక్టర్లు తెగ ప్రయత్నిస్తుంటారు. అలాగే ప్రేక్షకులు కూడా పలానా డైరెక్టర్ హిట్టు కొట్టి మళ్ళీ ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఇక ఆ దర్శకుల లిస్ట్ ఓ సారి చూద్దాం రండి :
1) వి.వి.వినాయక్ :ఒకప్పుడు రాజమౌళి తరువాత టాప్ డైరెక్టర్ అంటే వినాయక్ పేరే చెప్పేవారు. ఒక దశలో రాజమౌళిని మించిన డైరెక్టర్ అని కూడా చెప్పేవారు. ఆది,ఠాగూర్ దగ్గర్నుండీ నాయక్ వరకూ టాప్ ప్లేస్ లో కొనసాగాడు వినాయక్. అయితే తరువాత వచ్చిన ‘అఖిల్’ ‘ఇంటిలిజెంట్’ చిత్రాలు డిజాస్టర్లు కావడంతో వినాయక్ రేస్ లో వెనుకపడ్డారు. మధ్యలో ‘ఖైదీ నెం 150’ బ్లాక్ బస్టర్ కొట్టినా అది మెగాస్టార్ అకౌంట్ లో కొట్టుకుపోయింది.
2) మెహర్ రమేష్ :ఎన్టీఆర్ తో ‘కంత్రి’ చేసి కమర్షియల్ హిట్ కొట్టాడు. ‘బిల్లా’ లో ప్రభాస్ ను సూపర్ స్టైలిష్ లుక్ లో చూపించి వారెవా అనిపించాడు. కానీ తరువాత ‘శక్తి’ ‘షాడో’ వంటి చిత్రాలతో నిర్మాతలతో పాటూ ప్రేక్షకుల్ని కూడా భయపెట్టేసాడు. కానీ హీరోని మంచి స్టయిలిష్ గా చూపించాలి అంటే ఈ డైరెక్టర్ టాప్ ఆర్డర్ లో ఉంటాడు.
3)శ్రీకాంత్ అడ్డాల :మంచి సినిమాలకి పెట్టింది పేరు. ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో అందరినీ ఆకట్టుకున్నాడు. టాలీవుడ్లో మల్టీ స్టారర్ ఓ కల. ఒకవేళ దానిని సెట్ చేసినా హిట్టందుకోవడం చాలా కష్టం అని బయపడేవాళ్ళకి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం తీసి హిట్టు కొట్టి ఓ కొత్త ట్రెండ్ సృష్టించాడు. ఇక వరుణ్ తేజ్ ను ‘ముకుంద’ చిత్రంతో లాంచ్ చేసి పర్వాలేదనిపించాడు. కానీ బంగారం లాంటి అవకాశాన్ని ‘బ్రహ్మోత్సవం’ తో పాడుచేసుకున్నాడు.
4)పూరి జగన్నాథ్ : సినిమా హిట్టయినా ప్లాపయినా పూరి సినిమా అంటే ప్రత్యేక ‘ఫ్యాన్ బేస్’ ఉంది. ఓ హీరోకి స్టార్ ఇమేజ్ కావాలంటే పూరి తో సినిమా చేయాల్సిందే. ‘చరణ్’ లాంటి కొత్త హీరోని కూడా చిరుతతో స్టార్ హీరోని చేసేసాడు. అయన డైలాగ్స్ అంటే ఇప్పటికీ ప్రేక్షకులు పడిచస్తుంటారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు , ప్రభాస్,అల్లు అర్జున్, వంటి హీరోలు పూరితో సినిమా చేసిన తరువాతే స్టార్లు గా ఎదిగారు. ఇక ఇమేజ్ చాలా వరకూ డామేజ్ అయిపోయే తరుణంలో ఎన్టీఆర్ ని ‘టెంపర్’ తో లేపాడు.
5)సంతోష్ శ్రీనివాస్ : మొదటి చిత్రం ‘కందిరీగ’ తోనే మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సంతోష్ శ్రీనివాస్. వెంటనే ఎన్టీఆర్ తో ‘రభస’ సినిమా చేసే అవకాశాన్ని కొట్టేసాడు. కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ఇక మరోసారి రామ్ తో చేసిన ‘హైపర్’ కూడా ప్లాపవ్వడంతో ముందుకి వెళ్ళలేకపోయాడు. కానీ సరైన సినిమా పడాలే కానీ ఈ డైరెక్టర్ కూడా టాప్ డైరెక్టరయిపోతాడు అనడంలో సందేహంలేదు.
6) కృష్ణవంశీ :ఫ్యామిలీ, మెసేజ్ ప్రాధాన్యతగల సినిమాలకి పెట్టింది పేరు కృష్ణవంశీ. ఈయనకి క్రియేటివ్ డైరెక్టర్ అనే గుర్తింపు కూడా ఉంది. అయితే ఈయన హిట్టు కొట్టి చాలా కాలమయ్యింది. ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం పర్వాలేదనిపించినా ‘నక్షత్రం’ సినిమా మళ్ళీ క్రిందికి లాగేసింది.
7)రవిబాబు :క్రియేటివ్ డైరెక్టర్స్ లో రవిబాబు పేరు కూడా వినిపించేది. ‘అనసూయ’ ‘నచ్చావులే’ వంటి చిత్రాలతో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. రొటీన్ సినిమాల జోలికి పోడు. స్టార్ డైరెక్టర్ అయిపోవాలని ఆరాటపడడు. కొత్తగా ప్రయత్నిస్తుంటాడు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు ఈయన హిట్టు కొట్టాలని.. కోరుకుంటున్నారు.
8)బోయపాటి శ్రీను : వరుస ప్లాపులతో వెనుకబడిపోయిన బాలకృష్ణ కే హిట్టిచ్చిన మొనగాడు మన బోయపాటి శ్రీను. ఈ సీన్లో హీరో విలన్లని ఎన్ని రకాలుగా చితకబాదాలని ఓ మాస్ ప్రేక్షకుడు కోరుకుంటాడో అన్ని రకాలుగా హీరోతో కొట్టించే ‘సరైనోడు’ మన బోయపాటి. కమర్షియల్ ఎలెమెంట్స్ అస్సలు మిస్ చేయడు. రివ్యూలు మంచిగా రాకపోయినా ఈయన సినిమా చూడటానికి మాస్ ఆడియన్స్ ఎగపడతారు. ‘వినయ విధేయ రామా’ వంటి డిజాస్టర్ సినిమాతో కూడా 63 కోట్ల షేర్ ను రప్పించగల కెపాసిటీ ఉన్న టాప్ డైరెక్టర్. ఈయన హిట్టు కొడితే ఇండస్ట్రీ షాకయ్యే హిట్టే కొడతాడు అనడంలో సందేహం లేదు.
9) భాస్కర్ : ‘బొమ్మరిల్లు’ వంటి క్లాస్ చిత్రంతో కూడా బాక్సాఫీస్ ను షాక్ చేసాడు ఈ డైరెక్టర్. అల్లు అర్జున్ తో ‘పరుగు’ పెట్టించాడు. కానీ ‘ఆరెంజ్’ ‘ఒంగోలు గిత్త’ చిత్రాలతో అడ్రెస్ లేకుండా పోయాడు. కానీ ఈ యూత్ ని ఆకర్షించే సినిమాలు తీసి శభాష్ అనిపించుకోవడంలో ఈయన కూడా ‘తోపు’ అనే చెప్పాలి. ఎంత డిజాస్టర్ అయినా ‘ఆరెంజ్’ చిత్రం ఇప్పటికి తెగ చూస్తుంటారు అంటే అతిశయోక్తి లేదు. ఈ చిత్రం ఇప్పుడు కాని విడుదలైతే సూపర్ హిట్ అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.
10) శ్రీను వైట్ల :
కెరీర్ స్టార్టింగ్ లో ఈయన ఓ టాప్ డైరెక్టర్. చెప్పాలంటే ‘ఆగడు’ చిత్రం వరకూ టాప్ డైరెక్టరే. కానీ ఆ చిత్రం నుండీ రిపీట్ ఫార్ములాని అప్లై చేయడం వల్ల ఫామ్ కోల్పోయాడు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు… ఆయన ‘దూకుడు’ చూపించింది ఈయనే. అంతేకాదు హిట్టు మొహం చూడని మంచు విష్ణు వర్ధన్ బాబు కి హిట్టిచ్చిన గ్రేట్ డైరెక్టర్. ఈయన కామెడీ టైమింగ్ కు సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈయన కూడా ఓ హిట్టు కొట్టి కమ్ బ్యాక్ అవ్వాలని చాలా మంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
11)కరుణాకరన్ :ప్రేమ అంటే తెలియని వాళ్ళు కూడా ఈయన సినిమాలు చూస్తే ప్రేమలో పడిపోవడం ఖాయం అనడంలో అతిశయోక్తి లేదు. ‘తొలిప్రేమ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ డైరెక్టర్ ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ ‘డార్లింగ్’ వంటి చిత్రాలతో టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఈయన ప్లాప్ చిత్రాలైన ‘యువకుడు’ ‘బాలు’ ‘వాసు’ ‘హ్యాపీ’ వంటి చిత్రాలకి కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఏమైందో ఏమో ‘ఎందుకంటే ప్రేమంట’ ‘చిన్నదాన నీకోసం’ ‘తేజ్ ఐ లవ్ యు’ వంటి డిజాస్టర్ సినిమాలతో వెనుకపడిపోయాడు. మళ్ళీ ఎప్పుడెప్పుడు మంచి లవ్ స్ట్రోరి తో హిట్టుకొట్టి మళ్ళీ ఫామ్లోకి వస్తాడా అని ప్రేక్షకులు ఎదుచూస్తున్నారు.