Enemy Collections: పర్వాలేదనిపించిన ‘ఎనిమి’ ఫస్ట్ వీక్ వసూళ్లు ..!

  • November 11, 2021 / 01:22 PM IST

కోలీవుడ్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎనిమి’. మరో హీరో ఆర్య కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఆనంద్ శంకర్ తెరకెక్కించాడు. విశాల్ పోలీస్ ఆఫీసర్ గా…. ఆర్య నెగిటివ్ రోల్లో కనిపించిన ఈ చిత్రంలో ‘గద్దలకొండ గణేష్‌’ ఫేమ్ మృణాళిని హీరోయిన్‌గా నటించింది.ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన లభించడంతో ఈ సినిమా అంచనాలు బాగానే నమోదయ్యాయి. అయితే నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ ను మాత్రమే రాబట్టుకుంది. ఓపెనింగ్స్ పరంగా మొదటిరోజు పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం ఆ తర్వాత పెద్దగా జోరు చూపించలేకపోయింది. ఓవర్ ఆల్ గా బిజినెస్ తో పోల్చుకుంటే మొదటివారం పర్వాలేదనిపించింది.

ఫస్ట్ వీక్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం 0.92 cr
సీడెడ్ 0.48 cr
ఉత్తరాంధ్ర 0.29 cr
ఈస్ట్ 0.22 cr
వెస్ట్ 0.18 cr
గుంటూరు 0.23 cr
కృష్ణా 0.19 cr
నెల్లూరు 0.15 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.66 cr

‘ఎనిమి’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.66 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.1.34 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus