CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనలో పవన్ అభిమానులు..ఎందుకంటే?
July 13, 2023 / 04:47 PM IST
|Follow Us
ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి మరియు వైసీపీ పార్టీ కి ఏ రేంజ్ లో గొడవలు జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ఇరువురి వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ చూసినా వీళ్ళ మధ్య జరుగుతున్న గొడవల గురించే చర్చ. అదంతా పక్కన పెడితే గతం లో పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి ఫ్లాప్ అయ్యింది అనే విషయం తెలుసుకొని జగన్ అయ్యో అవునా,పాపం నిర్మాతలకు బయ్యర్స్ కి బాగా నష్టం కదా అని బాధపడ్డాడు అట.
ఆ సినిమా మరేదో కాదు,కాటమరాయుడు అట. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీ లో కొంతమంది వైసీపీ ఎమ్యెల్యేలు బ్రేక్ టైం లో సరదాగా మాట్లడుకుంటూ ‘కాటమరాయుడు’ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చిందట, భారీ నష్టాలు వస్తాయి అని అంటున్నారు అని గుసగుసలాడుకోవడం జగన్ విన్నాడట, అప్పుడు అవునా అయ్యో పాపం అని అన్నట్టు అప్పట్లో ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.
ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం ఈనెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గత రెండు చిత్రాలైన భీమ్లా నాయక్ మరియు వకీల్ సాబ్ చిత్రాలను జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తోక్కేసిన విషయం ప్రతీ ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర లో నడుస్తున్న పొలిటికల్ హీట్ నడుమ,జగన్ ‘బ్రో’ చిత్రాన్ని కూడా అదే విధంగా తొక్కబోతున్నాడా,లేదా వదిలేస్తాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
ఒకవేళ తొక్కితే మాత్రం పవన్ కళ్యాణ్ కి రాజకీయంగా ఒక రేంజ్ మైలేజి ఇచ్చినట్టు, (CM Jagan) జగన్ ఈసారి అలాంటి పనులు చెయ్యడని అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. గతం లో పవన్ కళ్యాణ్ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినందుకు బాధపడిన జగన్, ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా తొక్కుతున్నాడా లేదా అనేది బ్రో చిత్రం విడుదలప్పుడు తెలుస్తాది.