Love Story: అందరి చూపు ‘లవ్ స్టోరీ’ పైనే.. అంత నమ్మకం ఏంటబ్బా..!
June 22, 2021 / 09:52 PM IST
|Follow Us
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘లవ్ స్టోరీ’ చిత్రం నిజానికి ఏప్రిల్ 16 నే విడుదల కావాల్సింది కానీ.. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వల్ల థియేటర్లు మూతపడటంతో వాయిదా పడింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, పాటలు వంటివి కూడా ఆకట్టుకోవడంతో ఈ సినిమా పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. థియేటర్లు తెరుచుకున్నప్పటికీ జనాలు థియేటర్లకు వస్తారన్న గ్యారెంటీ లేదు.
సెకండ్ వేవ్ ఉధృతికి ఎంతో మంది మృత్యువాత పడడంతో జనాలు బాగా భయపడిపోయారు.ఎక్కువ శాతం జనాలు నిత్యావసరాల కోసం తప్ప.. వాళ్ళు బయటకు రావడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చినా… జనాలు థియేటర్లకు వస్తారన్న గ్యారెంటీ లేదు.పెద్ద సినిమాలు విడుదలైతే తప్ప అది అసాధ్యమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.అయితే ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని కనుక విడుదల చేస్తే కచ్చితంగా జనాలు థియేటర్లకు వస్తారని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘లవ్ స్టోరీ’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని..
ముఖ్యంగా యూత్ ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారని.. మా చిత్రం విడుదలైతే థియేటర్ల వద్ద పూర్వ వైభవాన్ని అందరూ చూడొచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకోసమే ఓటిటి సంస్థల నుండీ భారీ ఆఫర్లు వచ్చినా.. ‘లవ్ స్టోరీ’ ని ఇవ్వలేదని’ వారు స్పష్టం చేశారు.