కంటెంట్, ఎమోషన్, క్వాలిటీతోపాటు డీలింగ్ కూడా కొత్తగా ఉంది
March 16, 2019 / 01:36 PM IST
|Follow Us
సాధారణంగా ఒక సినిమా ట్రైలర్ విడుదలవుతుందంటే.. కనీసం రెండు మూడు రోజుల ముందు నుంచీ హడావుడి మొదలవుతుంది. రెండ్రోజుల్లో వస్తోంది, రేపే వస్తోంది అని సినిమా రిలీజ్ రేంజ్ లో హడావుడి జరగడం అనేది చాలా కామన్ అయిపోయింది. కానీ.. నిన్న చాలా సైలెంట్ గా, అసలు రిలీజ్ అయినట్లు కూడా తెలియని ఒక చిన్న సినిమా ట్రైలర్ చిన్నసైజు సంచలనం సృష్టిస్తోంది. ఆ సినిమా పేరు “ఎవ్వరికీ చెప్పొద్దు”. సినిమా పేరు ఎవ్వరికీ చెప్పొద్దు అయినప్పటికీ.. ట్రైలర్ చూశాక మాత్రం “అందరికీ చెప్పాలి” అనిపిస్తుంది.
వారాని రెండుమూడు ట్రైలర్లు విడుదలవుతున్న ఈ తరుణంలో ఒక చిన్న సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలంటే కంటెంట్ చాలా అవసరం. “బాహుబలి” సినిమాలో సేతుపతి పాత్రలో మెరిసిన రాకేష్ వర్రే కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ను నిన్న యువ హీరో శర్వానంద్ విడుదల చేశాడు. గార్గేయి యల్లాప్రగడ కథానాయికగా నటిస్తుండగా.. బసవ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చాలా సింపుల్ & డీసెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో వేర్వేరు కులాలకు చెందిన ప్రేమికులు.. పెద్దల్ని ఒప్పించి ఎలా పెళ్లి చేసుకొన్నారు అనేది కథాంశం అని ట్రైలర్ తో హింట్ ఇచ్చాడు దర్శకుడు. శేఖర్ సినిమాలా క్లీన్ గా ఉన్న ఈ సినిమా ట్రైలర్.. సినిమా మీద మంచి అంచనాలను క్రియేట్ చేసింది. సమ్మర్ కానుకగా మార్చి 22న విడుదలవుతోంది. చూస్తుంటే.. ఈ సీనియమ సైలెంట్ సూపర్ హిట్ అయ్యేలా ఉంది.