మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 7 న నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా రిలీజ్ కాబోతుంది. అలాగే మరో మూడు రోజుల్లో అంటే డిసెంబర్ 8 న నితిన్ హీరోగా నటించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రిలీజ్ కాబోతుంది. తమ సినిమాలను ఈ ఇద్దరు హీరోలు ఓ రేంజ్లో ప్రమోట్ చేసుకుంటున్నారు.’భీష్మ’ తర్వాత నితిన్ కి ఈ మధ్య సరైన హిట్టు లేదు. పైగా వక్కంతం వంశీ దర్శకుడిగా చేసిన మొదటి సినిమా అంతగా ఆడలేదు.
అందుకే ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ ని ఓ రేంజ్లో ప్రమోట్ చేస్తున్నాడు నితిన్. మరోపక్క నాని గత చిత్రం ‘దసరా’ హిట్ అయినా ఇప్పుడు ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో పెర్ఫార్మ్ చేస్తుండటంతో ఆ సినిమా డామినేట్ చేయకూడదు అని ‘హాయ్ నాన్న’ ని కూడా అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ రెండు సినిమా యూనిట్లను, హీరోలని.. ఓ విషయంలో బాగా మెచ్చుకోవచ్చు. ఇందులో అంటే.. యూ.ఎస్ ప్రమోషన్స్ విషయంలో..!
అవును నాని (Hi Nanna) ‘హాయ్ నాన్న’ ని, నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ ని అమెరికాలో భారీ ఎత్తున ప్రమోట్ చేయనున్నారు. నాని సినిమాలు ఓవర్సీస్ లో ఏదో ఒక రకంగా 1 మిలియన్ కొట్టేస్తాయి. కాబట్టి ‘హాయ్ నాన్న’ ని ఇంకాస్త ఎక్కువగా పుష్ చేస్తే ఇంకా బాగా కలెక్ట్ చేస్తుంది అని అతని ఆలోచన. ఇక ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ వంటి కామెడీ టచ్ ఉన్న సినిమాని ఓవర్సీస్ లో ప్రమోట్ చేస్తే ఎక్కువ ఉపయోగమే ఉంటుంది.
ఇలాంటి సినిమాలకి అక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే నితిన్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. ఈ మధ్య తెలుగులో కంటే ఓవర్సీస్ లోనే మన సినిమాలకి ఎక్కువ స్క్రీన్స్ దొరుకుతున్నాయి. ఒకప్పుడు అంటే రివ్యూల పై ఆధారపడి అక్కడ ఓపెనింగ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోకుండా అక్కడి జనాలు కొత్త సినిమాలని ఎక్కువగా చూస్తున్నారు. పైగా ఇప్పుడు అక్కడ టికెట్ రేట్లు కూడా మునుపటితో పోలిస్తే తక్కువగానే ఉంటున్నాయి.
అన్నీ ఎలా ఉన్నా.. ముందుగా షోలు ఓవర్సీస్లోనే పడతాయి. సినిమా ఎలా ఉంది అనే టాక్ అక్కడి నుండే ముందుగా వస్తుంది. కాబట్టి.. మన సినిమాలని అక్కడ ప్రమోట్ చేస్తే రిజల్ట్ ఇంకాస్త బెటర్ గానే ఉంటుంది. ఈ సినిమాల రిజల్ట్స్ అక్కడ బాగా వస్తే.. మిగతా సినిమా యూనిట్లు కూడా ఓవర్సీస్ ప్రమోషన్స్ పై శ్రద్ధ పెడతారు అనడంలో సందేహం లేదు.
యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!
దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!