Extra Ordinary Man Collections: ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసింది..?

  • December 15, 2023 / 06:51 PM IST

నితిన్, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శ్రేష్ఠ్ మూవీస్’, ‘రుచిర ఎంటర్టైన్మెంట్స్’, ‘ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్’ బ్యానర్ల పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి నిర్మించారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇక డిసెంబర్‌ 8న రిలీజ్ అయిన ఈ చిత్రానికి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది.కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయింది అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.56 cr
సీడెడ్ 0.47 cr
ఉత్తరాంధ్ర 0.45 cr
ఈస్ట్ 0.21 cr
వెస్ట్ 0.18 cr
గుంటూరు 0.24 cr
కృష్ణా 0.28 cr
నెల్లూరు 0.17 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.56 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.41 cr
 ఓవర్సీస్ 0.46 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 4.43 cr (షేర్)

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ (Extra Ordinary Man) చిత్రానికి రూ.23.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి రూ.24 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 7 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.4.43 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.19.57 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.బ్రేక్ ఈవెన్ అవ్వడం ఇక అసాధ్యమనే చెప్పాలి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus