సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను సంతృప్తిపరచని మహేష్ వ్యాక్స్ స్టేట్యూ

  • March 25, 2019 / 05:38 PM IST

ఇవాళ ఉదయం హైద్రాబాద్ లోని ఏ.ఎం.బి సినిమాస్ లో “మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్” కోసం తయారు చేసిన మహేష్ బాబు సరికొత్త మైనపు బొమ్మను స్వయంగా మహేష్ బాబు లాంచ్ చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే సింగపూర్ తరళించనున్న ఈ మైనపు బొమ్మను ఒక రెండు రోజులపాటు హైద్రాబాద్ లోనే సూపర్ స్టార్ అభిమానుల కోసం ఉంచనున్నారు. ఇవాళ మైనపు బొమ్మ ఆవిష్కరించినప్పుడు ఆ స్టేజ్ మీద మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలు కూడా ఉండడం.. వాళ్ళందరూ కలిసి ఒకే స్టేజ్ మీద ఆ మైనపు బొమ్మతో కలిసి ఫోటో దిగడం.. ఇలా అంతా బాగున్నా సూపర్ ఫ్యాన్స్ కి ఒక అసంతృప్తి మాత్రం మిగిలిపోయింది.

ఆ అసంతృప్తి ఏమిటంటే.. ఆల్మోస్ట్ మహేష్ బాబు అంత అందంగా ఉన్న ఆయన మైనపు బొమ్మ ఫోజ్ మాత్రం బాగోలేదని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆ ఫోజ్ ఒక్కటీ బాగుండి ఉంటే.. మైనపు బొమ్మ అదిరిపోయేది అంటున్నారు. జాగ్రత్తగా గమనిస్తే అది కూడా నిజమే అనిపిస్తుంది. నమ్రత ఆ ఫోజ్ విషయంలో కాస్త జాగ్రత్తపడాల్సింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus