హద్దుమీరి హీరోయిన్ ని ముద్దాడబోయిన అభిమాని!

  • January 10, 2020 / 07:06 PM IST

అభిమాని చూపించిన అత్యుత్సాహంతో బాలీవుడ్ నటి సారా అలీఖాన్ షాకైంది. ‘కేథార్ నాథ్’ సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైన సారా ‘సింబా’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం ఈ బ్యూటీ ‘లవ్ ఆజ్ కల్’ సీక్వెల్ లో నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ జిమ్ నుండి బయటకి వస్తుండగా.. అభిమానులు, కొందరు ఫోటోగ్రాఫర్లు ఆమెని ఫోటోలకు స్టిల్స్ ఇవ్వమని కోరారు. ఈ క్రమంలో కొందరు అభిమానులతో ఫోటోలు దిగింది సారా.

ఈ క్రమంలో ఓ అభిమాని కరచాలనం చేయమని కోరగా.. సారా వెంటనే చేయి అందించారు. దీంతో అభిమాని కరచాలనం చేసి వెంటనే ఆమె చేతిపై ముద్దు పెట్టబోయాడు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ కి గురైంది. వెంటనే తన చేయిని వెనక్కు తీసుకుంది. అక్కడే ఉన్న సారా సెక్యురిటీ సదరు వ్యక్తిని కొట్టడానికి ప్రయత్నించారు. అనంతరం సారా అక్కడ నుండి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. మీ అందానికి ఫిదా అయిపోతున్నారని కొందరు.. సెక్యురిటీని పెంచుకోమని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.


దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!
అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus