Ticket Rates: ప్రేక్షకుల బాధ నిర్మాతలకు అర్థం కాదా?
April 13, 2022 / 04:17 PM IST
|Follow Us
భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజయ్యే సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అభిమానులు భావిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో రిలీజవుతున్న ప్రతి పెద్ద సినిమాకు టికెట్ రేట్లను పెంచుతూ నిర్మాతలు అభిమానులకు భారీ షాక్ ఇస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్ రేట్లను పెంచినా ఆ సినిమా భారీ బడ్జెట్ సినిమా కావడంతో ప్రేక్షకులు సైతం ఫీల్ కాలేదు. అయితే డబ్బింగ్ మూవీ అయిన కేజీఎఫ్2 సినిమాకు కూడా తెలంగాణలో టికెట్ రేట్లు పెరిగాయి.
టికెట్ రేట్లు అంతకంతకూ పెరగడం వల్ల తాత్కాలికంగా నిర్మాతలకు లాభం చేకూరినా భవిష్యత్తులో విడుదలయ్యే పెద్ద సినిమాలకు మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. టికెట్ రేట్లను అంతకంతకూ పెంచితే ప్రేక్షకులు ఆ స్థాయి రేట్లను భరించలేక ఓటీటీలో సినిమా రిలీజయ్యే వరకు వేచి చూద్దాం అని భావించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్2 టికెట్ రేట్ల పెంపుపై నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. డబ్బింగ్ సినిమాకు కూడా టికెట్ రేట్ల పెంపు ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
టికెట్ రేట్ల పెంపు వల్ల ఫ్యామిలీతో కలిసి సినిమా చూసే పరిస్థితి లేదని ప్రేక్షకులు వాపోతున్నారు. నిర్మాతల, డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ ప్రేక్షకుల పాలిట శాపంగా మారుతోంది. అయితే డిస్ట్రిబ్యూటర్లకు పరిస్థితి అర్థం కావడానికి ఎంతో సమయం పట్టదు. సినిమాకు హిట్ టాక్ వస్తే ఏ సమస్య లేకపోయినా ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. రాధేశ్యామ్ సినిమాకు సైతం టికెట్ రేట్ల పెంపు ఒకింత మైనస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఏపీలో మాత్రం కేజీఎఫ్2 సినిమాకు టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నాయి. ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. నిర్మాతలు పరోక్షంగా ఓటీటీల హవా మరింత పెరిగేలా చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రిలీజైన మూడు వారాలకే పెద్ద సినిమాలు ఓటీటీలో వస్తుండటంతో సినిమాలు చూసే విషయంలో ప్రేక్షకులు సైతం తమ ఆలోచనలను మార్చుకుంటున్నారు.