KGF2: కేజీఎఫ్2 ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా..?

  • April 14, 2021 / 02:14 PM IST

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు నవ్యత ఉన్న కథలతో తెరకెక్కిన సినిమాలను ఎక్కువగా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ చేస్తున్నారు. అందువల్ల దర్శకనిర్మాతలు సైతం హీరో ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శాండిల్ వుడ్ స్టార్ హీరో యశ్ ప్రస్తుతం కేజీఎఫ్ ఛాప్టర్2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ ఛాప్టర్1 హిట్ కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే కేజీఎఫ్ ఛాప్టర్2 యాంటీ క్లైమాక్స్ తో తెరకెక్కుతోందని శాండిల్ వుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఐదు భాషల్లో జులై 16వ తేదీన కేజీఎఫ్ ఛాప్టర్2 రిలీజ్ కానుంది. కేజీఎఫ్ ఛాప్టర్1 230 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో కేజీఎఫ్ ఛాప్టర్2 హక్కులు ఏకంగా 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. తెలుగులో కేజీఎఫ్ ఛాప్టర్1 13 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. ఇప్పటికే విడుదలైన కేజీఎఫ్ ఛాప్టర్2 టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో విలన్ రోల్ లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటిస్తుండగా యశ్,

సంజయ్ దత్ మధ్య సన్నివేశాలను ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించారని సమాచారం. అయితే ఈ సినిమాలో రాఖీభాయ్ పాత్ర క్లైమాక్స్ లో ప్రధాని పాత్ర పోషిస్తున్న రవీనా టాండన్ సైన్యం చేతిలో చనిపోతుందని తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాను ఎమోషనల్ గా ముగించనున్నారని తెలుస్తోంది. తల్లికి ఇచ్చిన మాట ప్రకారం యశ్ ధనవంతుడిగానే సినిమాలో చనిపోతారని సమాచారం. హీరో చనిపోతే సినిమాలు హిట్టయ్యే అవకాశం తక్కువ కాబట్టి కేజీఎఫ్2 ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus