సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ ని జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చేయాలి..!
February 10, 2017 / 06:26 AM IST
|Follow Us
మహానటుడు నందమూరి తారక రామారావు జీవితంపై సినిమా చేస్తాను అని ఆయన తనయుడు నటసింహ బాలకృష్ణ చెప్పడంతో నందమూరి అభిమానులు ఆనందపడుతున్నారు. చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ కంటే జూనియర్ ఎన్టీఆర్ అయితే చాలా బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద చర్చే జరుగుతుంది. తారక్ కే ఎక్కువమంది ఓటేస్తున్నారు. కలక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తుందని చెబుతున్నారు. అభిమానులు ఎంత ఎంకరేజ్ చేస్తున్నా ఈ విషయంలోకి మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంటర్ కావడం లేదు.
నందమూరి కుటుంబ సభ్యుల్లో అందరూ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి మెలిసి ఉన్నారు. బాలకృష మాత్రమే యంగ్ టైగర్ ని దూరం పెడుతున్నారు. కారణం ఏమో తెలియదు కానీ బాబాయ్ అంటూ… తారక్ ఎంత దగ్గరవుదామన్న బాలయ్య దూరం పెడుతున్నారు. ఈ సమయంలో తాత పాత్రలో నటించాలని, ఈ సినిమా తాను చేస్తానని అడగడానికి సాహసించడం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విష్ణు ఇందూరి నిర్మించనున్న ఈ మూవీ ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.