మెగా ఫ్యామిలీ మల్టీస్టారర్ దిశగా అడుగులు పడతాయా?

  • December 1, 2022 / 01:04 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ ఫ్యామిలీలో లేని స్థాయిలో మెగా ఫ్యామిలీలో హీరోలు ఉన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో చాలామంది సినిమా రంగంలో సక్సెస్ సాధించారు. చిరంజీవి, పవన్, చరణ్, బన్నీ, వరుణ్ తేజ్, సాయితేజ్, వైష్ణవ్ తేజ్, నాగబాబులకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. మెగా హీరోలంతా కలిసి ఒక సినిమాలో నటిస్తే ఆ సినిమా రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు కమర్షియల్ గా సక్సెస్ సాధించే అవకాశాలు ఉంటాయి.

రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో ఇలాంటి క్రేజీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. చిరంజీవి ఈ దిశగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మెగా ఫ్యామిలీకి ఈ తరహా సినిమా మెమొరబుల్ మూవీగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే ప్రముఖ రచయితలు సైతం ఈ తరహా కథలను సిద్ధం చేస్తారు. మరోవైపు చిరంజీవి బాబీ కాంబినేషన్ లో వాల్తేరు వీరయ్య సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి శృతి హాసన్ కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య మూవీకి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడయ్యాయనే సంగతి తెలిసిందే.

చిరంజీవి ఊరమాస్ లుక్ లోకనిపిస్తూ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. చిరంజీవి సైతం రీఎంట్రీలో ఈ సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో చేరుతుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవికి యంగ్ జనరేషన్ లో కూడా కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus