Rajamouli: మహాభారతంపై జక్కన్నకు ఫ్యాన్స్ సూచనలు.. అలా చేయాలంటూ?
May 13, 2023 / 12:27 PM IST
|Follow Us
టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి మహాభారతం సినిమాను పది పార్టులుగా తెరకెక్కిస్తానని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే రాజమౌళి ఒక్కో సినిమాకు 4 నుంచి 5 సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. మహాభారతం పది పార్టులను జక్కన్న పూర్తి చేయాలంటే కనీసం 25 సంవత్సరాల సమయం పడుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కు స్టార్ హీరోలు డేట్లు కేటాయించడం సైతం సులువు కాదనే సంగతి తెలిసిందే.
అయితే మహాభారతంలో ఏ పాత్రలకు ఎవరు బాగుంటారనే ప్రశ్నలకు సమాధానంగా నెటిజన్లు కొన్ని సూచనలు చేస్తుండటం గమనార్హం. ధర్మరాజుగా పవన్, కర్ణుడిగా ప్రభాస్, భీముడిగా ఎన్టీఆర్ సూట్ అవుతారని నెటిజన్లు సూచనలు చేస్తున్నారు. మహేష్ కృష్ణుడి పాత్రకు, రానా దుర్యోధనుడి పాత్రకు, చరణ్ అర్జునుడి పాత్రకు సూట్ అవుతారని ఫ్యాన్స్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ అశ్వద్ధాముడి పాత్రకు, బాలయ్య పరశురాముడి పాత్రకు సూట్ అవుతారని ఫ్యాన్స్ చెబుతున్నారు.
మరి జక్కన్న మైండ్ లో ఏముందో తెలియాల్సి ఉంది. ఈ హీరోలు ఆ పాత్రలకు సూట్ అయినా డేట్లు కేటాయించడం సులువు కాదు. మరి రాజమౌళి ఏం చేస్తారో చూడాల్సి ఉంది. జక్కన్న పారితోషికం ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. మహాభారతం సినిమాను జక్కన్న తెరకెక్కిస్తే ఆ సినిమాకు నిర్మాతగా ఎవరు వ్యవహరిస్తారో చూడాలి. జక్కన్న సినిమాలను నిర్మించాలంటే ఊహించని స్థాయిలో ఖర్చు చేయాల్సి ఉంది.
రాజమౌళి (Rajamouli) మహేష్ సినిమాకు సంబంధించి ఏవైనా అప్ డేట్స్ ఇస్తే బాగుంటుందని కామెంట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్ జక్కన్న కాంబో మూవీ ఈ ఏడాదే మొదలవుతుందేమో తెలియాల్సి ఉంది.